
news,telangana,politics
సియం సర్ మీ సన్నిహితుడు నన్ను గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నాడు...సీఎం రేవంత్ రెడ్డికి శోభా రెడ్డి కీలక విజ్ఞప్తి
అడ్వర్టైజింగ్ రంగంలో వర్క్ ఆపర్చునిటీ, కాంట్రాక్ట్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తనను గెస్ట్‌హౌస్‌కు రావాలని పిలిచి దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించిన మహిళా వ్యాపారవేత్త కె. శోభా రెడ్డి మరోసారి స్పందించారు. తనను రాజకీయ పార్టీలకు అంటగడుతూ ‘పెయిడ్ ఆర్టిస్ట్’, ‘పేటీఎం బ్యాచ్’ అంటూ ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేస్తూ.. మున్సిపల్ శాఖలో అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుంచేందుకు ఒక్క అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరారు.
21 సెప్టెం, 20262 min read
