
news,telangana
వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం.. మీ సేవ కేంద్రాల ద్వారా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్
ఇప్పటి వరకు ప్రభుత్వ సేవలకే పరిమితమైన మీ సేవ కేంద్రాలు ఇకపై చిన్న వ్యాపారాల డిజిటల్ ప్రచారానికీ వేదిక కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, మెటా భాగస్వామ్యంతో మీ సేవ కేంద్రాలను డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా మార్చుతూ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా చిన్న వ్యాపారులు కూడా తక్కువ ఖర్చుతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రకటనలు ఇచ్చే అవకాశం పొందనున్నారు.
24 జులై, 20262 min read
