వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఇంటి ముందు ఓ యువతి ఆందోళనకు దిగింది. ఛైర్మన్ కుమారుడు శ్రీకాంత్ ప్రేమ పేరుతో తనను నమ్మించి మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా దగ్గరై, గర్భం దాల్చిన సందర్భాల్లో అబార్షన్ చేయించారని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. యువతికి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, స్థానికులు సంఘీభావం తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పెద్దవంగర మండలం బాబోజి తండా గ్రామంలో గ్రామాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశశ్విని రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామంలో కొనసాగుతున్న కీలక వంతెన నిర్మాణ పనులను పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశశ్విని రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు.
తొర్రూరు మండలం పోలేపల్లి గ్రామంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించడంతో పాటు గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.