
ములుగు నుంచి తొలి అడుగు.. తెలంగాణ గ్రామీణ రహదారులకు కొత్త అధ్యాయం
తెలంగాణ గ్రామీణ రహదారుల అభివృద్ధికి ములుగు నుంచి భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.16,007 కోట్లతో 2,145 రహదారులను 7,448 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్న ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి 16న ప్రారంభించనున్నారు.


