
international,news
విమానంలో పైలట్ల ఫైటింగ్.. 33 వేల అడుగుల నుంచి ఒక్కసారిగా 17 వేల అడుగులకు!
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య ఘర్షణ జరగడంతో విమానం నుంచి అత్యవసర సంకేతాలు వెలువడ్డాయి. దీంతో హైజాక్ అనుమానాలు తలెత్తగా చివరకు విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయానికి మళ్లించారు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు విమానయాన సంస్థ వెల్లడించింది.
30 సెప్టెం, 20261 min read
