
news,education,telangana
పాలిటెక్నిక్‌లు ప్రభుత్వానివే.. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు: రేవంత్ రెడ్డి
తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరిస్తారనే ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పాలిటెక్నిక్ కాలేజీలు 100 శాతం ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు. సాంకేతిక విద్యను ఆధునిక నైపుణ్యాలతో అనుసంధానించేందుకే సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 59 పాలిటెక్నిక్‌లను టాటా టెక్నాలజీస్ సహకారంతో రూ.4 వేల కోట్లతో ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు.
12 సెప్టెం, 20263 min read
