
news,education,crime,national
స్టూడెంట్ సాహిల్ ఆత్మహత్యతో రగిలిన IIT బాంబే.. ప్రొఫెసర్ సస్పెండ్
ముంబైలోని IIT బాంబేలో బీటెక్ విద్యార్థి సాహిల్ వాకోడ్ ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరీక్షలో మొబైల్ ఫోన్, చాట్‌జీపీటీ వినియోగం వ్యవహారం తర్వాత సాహిల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన కుమారుడిని ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ల వేధించారని, కుల వివక్షకు గురి చేశారని సాహిల్ తండ్రి ఆరోపించారు. దీంతో విద్యార్థులు మూడు రోజులుగా ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థులు పెట్టిన 18 డిమాండ్లపై IIT బాంబే డైరెక్టర్ అంగీకారం తెలిపారు. దూళ్లపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ నేపథ్యంలో ఆయనపై సంస్థ చర్యలు చేపట్టింది.
21 సెప్టెం, 20262 min read
