
ధరణి సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు..కేసీఆర్ పాలనపై అసెంబ్లీలో పొంగులేటి తీవ్ర ఆరోపణలు
తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పేదలు, రైతులు, భూయజమానులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ధరణి సమస్యలను అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు పలుమార్లు మాజీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని విమర్శించారు. ధరణిలోని సాంకేతిక లోపాలు, ‘సీక్రెట్ లాక్’ల వ్యవస్థ, భూ రికార్డుల సమస్యలపై శాసనసభలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

