
crime,india,national,news
టికెట్ అడిగిన టీటీఈపై లైంగిక బ్లాక్‌మెయిల్ డ్రామా.. వీడియోతో బట్టబయలైన యువతి డ్రామా
రైలు ప్రయాణంలో టికెట్ అడిగిన టీటీఈపై తప్పుడు లైంగిక వేధింపుల కేసు బనాయించేందుకు ఓ యువతి ప్రయత్నించినట్లు పేర్కొంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టికెట్ లేకపోవడంతో తొలుత డబ్బులు ఇస్తానంటూ బేరసారాలకు దిగిన ఆమె టీటీఈ నిరాకరించడంతో బెదిరింపులకు పాల్పడినట్లు వీడియోలో కనిపిస్తోంది. అనంతరం తన దుస్తులను తానే చింపుకుని, టీటీఈ తనను వేధిస్తున్నాడంటూ 112కు ఫోన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే టీటీఈ మొత్తం ఘటనను మొబైల్‌లో రికార్డు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
19 సెప్టెం, 20261 min read
