$12.9 బిలియన్ డాలర్లకు Hugging Face ను కొనుగోలు చేయనున్న Nvidia

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆధిపత్యం కోసం పోరు ఇక కేవలం AI మోడల్స్ మధ్యే కాదు.. వాటిని నడిపించే చిప్స్, సాఫ్ట్‌వేర్, డెవలపర్ ఎకోసిస్టమ్‌పైనా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఓపెన్-సోర్స్ AI ప్లాట్‌ఫామ్ Hugging Face ను సుమారు $12.9 బిలియన్లకు కొనుగోలు చేసేందుకు Nvidia అంగీకరించినట్లు తెలుస్తుంది. ఈ డీల్ ద్వారా AI చిప్స్‌లో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న Nvidia.. ఓపెన్ AI మోడల్స్, డేటాసెట్లు, డెవలపర్ కమ్యూనిటీ ఉన్న కీలక సాఫ్ట్‌వేర్ లేయర్‌లోనూ తన ప్రభావాన్ని పెంచుకునే అవకాశం ఉంది.

29 ఆగస్టు, 2026 6:02 PM•ByVijay Kumar

Share this article

$12.9 బిలియన్ డాలర్లకు Hugging Face ను కొనుగోలు చేయనున్న Nvidia

AI Image

టెక్ న్యూస్ August 29(జనవాణి): Nvidia-Hugging Face డీల్‌ను సాధారణ కంపెనీ కొనుగోలుగా చూడటం కంటే.. భవిష్యత్ AI కంప్యూటింగ్‌పై ఆధిపత్యం కోసం జరుగుతున్న వ్యూహాత్మక పోరులో భాగంగా చూడాల్సి ఉంటుంది. Hugging Faceను AI ప్రపంచానికి GitHub లాంటి ఓపెన్-సోర్స్ హబ్‌గా భావిస్తారు. డెవలపర్లు ఇక్కడ AI మోడల్స్, డేటాసెట్లు, టూల్స్‌ను షేర్ చేసుకోవడంతో పాటు వాటిని డౌన్‌లోడ్ చేసి తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటారు. Nvidia దీనిని సుమారు $12.9 బిలియన్లకు కొనుగోలు చేయనున్నట్లు వచ్చిన వార్తలు నిజమైతే.. చిప్ నుంచి మోడల్ వరకు AI స్టాక్‌లో Nvidia పరిధి గణనీయంగా విస్తరించనుంది.

చిప్ కంపెనీ నుంచి పూర్తి AI ప్లాట్‌ఫామ్ వైపు..

ఇప్పటివరకు Nvidia బలం ప్రధానంగా GPUలు, CUDA సాఫ్ట్‌వేర్ ఎకోసిస్టమ్, డేటా సెంటర్ కంప్యూటింగ్‌లో ఉంది. కానీ AI రంగం వేగంగా మారుతోంది. పెద్ద AI కంపెనీలు తమ సొంత చిప్స్‌ను అభివృద్ధి చేసుకుంటే.. Nvidiaపై ఆధారపడటం తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో Hugging Face ద్వారా Nvidiaకు AI మోడల్స్‌ను అభివృద్ధి చేసే లక్షలాది మంది డెవలపర్ల ఎకోసిస్టమ్‌తో మరింత ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుంది. అంటే కేవలం “AIని నడిపించే చిప్” అమ్మడం కాకుండా.. ఆ చిప్‌పై నడిచే మోడల్స్, టూల్స్, డెవలపర్ వర్క్‌ఫ్లోలోనూ Nvidia తన స్థానాన్ని బలోపేతం చేసుకోవచ్చు.

అసలు పోటీ OpenAI, Googleతో ఎందుకు?

ఇక్కడే ఈ డీల్ ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. OpenAI తాజాగా తన సొంత AI ప్రాసెసర్ Jalapeñoను అభివృద్ధి చేసింది. ఇది ప్రధానంగా AI inference కోసం రూపొందించబడింది. దీని లక్ష్యం Nvidia వంటి బాహ్య GPUలపై ఆధారపడటాన్ని కొంతమేర తగ్గించడం, భారీ స్థాయిలో AI సేవలను మరింత సమర్థవంతంగా నడపడం. అయితే ప్రస్తుతం OpenAI training workloads కోసం Nvidia వంటి ఇతర చిప్‌లపై ఆధారపడుతూనే ఉంది. Google మాత్రం చాలాకాలంగా తన సొంత Tensor Processing Units (TPUs)ను అభివృద్ధి చేస్తోంది. అంటే Googleకు AI మోడల్ కూడా సొంతమే, దాన్ని నడిపించే ప్రత్యేక AI hardware కూడా సొంతమే. ఈ vertical integration వల్ల hardware, software, models మధ్య ప్రత్యేకమైన optimization సాధ్యమవుతుంది.

OpenAI vs Nvidia..

OpenAIకి ప్రధాన బలం ChatGPT, frontier AI models, భారీ యూజర్ బేస్. ఇప్పుడు సొంత inference chip ద్వారా hardware ఖర్చులు, performance, energy efficiencyపై మరింత నియంత్రణ సాధించాలనే ప్రయత్నం చేస్తోంది. Nvidiaకు మరో సమస్య ఉంది. OpenAI మాత్రమే కాదు.. Anthropic సహా ఇతర AI సంస్థలు కూడా Nvidia hardwareపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు custom chips వైపు చూస్తున్నాయి. ఇలాంటి సమయంలో Nvidia Hugging Faceను తన పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఒక కీలక సందేశం ఇస్తోంది: “మీరు సొంత చిప్ తయారు చేసుకున్నా.. AI మోడల్స్, ఓపెన్-సోర్స్ టూల్స్, డెవలపర్ ఎకోసిస్టమ్ ఉండే లేయర్‌లో మేము ఇంకా బలంగా ఉంటాం.”

Google తో పోటీ మరింత ఆసక్తికరం..

Google మోడల్ + TPU + Cloud అనే మూడు స్థాయిలను కలిపి AI infrastructureను నిర్మిస్తోంది. Nvidiaకు Google మాదిరిగా సొంత consumer AI ecosystem లేదు. అందుకే Hugging Face వంటి విస్తృత ఓపెన్-సోర్స్ AI కమ్యూనిటీని సొంతం చేసుకోవడం Nvidiaకు software మరియు developer layerలో వ్యూహాత్మక ప్రయోజనాన్ని ఇవ్వగలదు. ముఖ్యంగా ఓపెన్-సోర్స్ AI పెరుగుతున్న కొద్దీ మోడల్స్‌ను ఎక్కడ తయారు చేస్తున్నారు? ఏ hardwareపై deploy చేస్తున్నారు? ఏ software stack ఉపయోగిస్తున్నారు? అన్న అంశాలు కూడా చిప్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి. Hugging Face ఈ మొత్తం ప్రక్రియలో కీలకమైన స్థానం కలిగి ఉంది.

Nvidia రిస్క్ చేస్తుందా ?

Hugging Face ఇప్పటివరకు Nvidia, AMD, Intel వంటి వివిధ hardware కంపెనీలకు అనుకూలంగా పనిచేసే తటస్థ ఓపెన్ AI ప్లాట్‌ఫామ్‌గా ఎదిగింది. Nvidia దానిని పూర్తిగా స్వాధీనం చేసుకుంటే.. ప్లాట్‌ఫామ్ తటస్థతపై డెవలపర్లలో సందేహాలు తలెత్తే అవకాశం ఉంది. ఇదే డీల్‌కు ప్రధాన సవాళ్లలో ఒకటి కావచ్చు.

మొత్తంగా చూస్తే.. భవిష్యత్ పోటీని అదిగమించడానికి Nvidia ఈ డీల్ చేస్తున్నట్లుంది

Nvidia-Hugging Face డీల్‌ను కేవలం $12.9 బిలియన్ల acquisitionగా చూడటం కష్టం. AI భవిష్యత్తులో hardware alone సరిపోదని Nvidia గుర్తించినట్లుగా ఇది కనిపిస్తోంది. OpenAI తన మోడల్‌కు తగిన సొంత చిప్‌ను తయారు చేసుకుంటోంది. Google తన మోడల్స్, Cloudతో పాటు TPUలను నియంత్రిస్తోంది. ఈ నేపథ్యంలో Nvidia మాత్రం GPU + software + developer ecosystem + open-source AI అనే విస్తృత వ్యూహంతో తన ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని చూస్తోంది. అందుకే రాబోయే AI యుద్ధం “ఎవరి మోడల్ గొప్పది?” అనే ప్రశ్నతో మాత్రమే నిర్ణయించబడదు. ఎవరి చిప్, ఎవరి సాఫ్ట్‌వేర్, ఎవరి డెవలపర్ ఎకోసిస్టమ్, ఎవరి డేటా సెంటర్ infrastructure కలిసి పనిచేస్తాయి? అన్నదే అసలు పోటీ. Nvidia-Hugging Face డీల్ ఆ పెద్ద మార్పుకు ఒక ముఖ్యమైన సంకేతంగా కనిపిస్తోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు