దేశానికి అమరావతి గాథ.. కేంద్ర మంత్రి ఖట్టర్‌కు కాఫీ టేబుల్ బుక్ అందజేసిన ఏపీ ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చరిత్ర, ప్రజల ఉద్యమం, పునర్నిర్మాణ సంకల్పాన్ని ప్రతిబింబించే "Amaravati: Built by the People... Protected by Destiny" కాఫీ టేబుల్ బుక్‌ను కేంద్ర విద్యుత్, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ఏపీ కూటమి ఎంపీల బృందం బుధవారం అందజేసింది. ఈ బృందంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు.

6 ఆగస్టు, 2026 8:56 AM•ByLaharika

Share this article

దేశానికి అమరావతి గాథ.. కేంద్ర మంత్రి ఖట్టర్‌కు కాఫీ టేబుల్ బుక్ అందజేసిన ఏపీ ఎంపీలు

పార్లమెంట్‌లో కేంద్ర మంత్రితో భేటీ

పార్లమెంట్‌లోని కేంద్ర మంత్రి కార్యాలయంలో ఖట్టర్‌ను కలిసిన ఏపీ కూటమి ఎంపీలు అమరావతి నిర్మాణ గాథను వివరిస్తున్న కాఫీ టేబుల్ బుక్‌ను అందజేశారు. రాష్ట్ర రాజధాని నిర్మాణ ప్రయాణం, రైతుల త్యాగాలు, ప్రజల ఉద్యమం వంటి అంశాలను ఈ పుస్తకం ద్వారా దేశ నాయకత్వానికి పరిచయం చేసినట్లు తెలిపారు.

అమరావతి పోరాటం దేశం తెలుసుకోవాలి

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ, అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం, రైతులు, మహిళలు సాగించిన 1,631 రోజుల ఉద్యమం, అలాగే 2024 జూన్ 2న అమరావతిని రాష్ట్ర రాజధానిగా పునరుద్ధరించిన నిర్ణయం వంటి కీలక ఘట్టాలను ఈ పుస్తకం సమగ్రంగా ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

అమరావతి పోరాటం ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన చరిత్ర అని, ఈ పుస్తకం కేవలం ఒక గ్రంథం కాదని, ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిరునామా అని వ్యాఖ్యానించారు.

ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు కూటమి ఎంపీలు కృషి చేస్తున్నారని ఎంపీ చిన్ని తెలిపారు.

సంపద సృష్టి, ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికతకు కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.

విజయవాడ సమస్యలపై వినతి

ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను కూడా కేంద్ర మంత్రి ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ చిన్ని తెలిపారు.

ఆ అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు