కేటీఆర్‌పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అమరావతిలో కేటీఆర్ భార్య శైలిమా పేరుతో భారీగా హోటల్ నిర్మించారంటూ ఆరోపించిన ఆయన యశోద ఆసుపత్రికి ప్రభుత్వ భూముల కేటాయింపు, మెడికోవర్ సంస్థతో సంబంధాలు, సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
వినాయక చవితి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రాంతీయ పార్టీ విధివిధానాలను వెల్లడించారు. యువతకు 66 శాతం రాజకీయ ప్రాతినిధ్యం, రైతులు-గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్, పెట్రో ఉత్పత్తులపై పన్నుల తగ్గింపు, నీటి నిల్వ సామర్థ్యాన్ని 3,000 టీఎంసీలకు పెంపు, విద్య-ఉద్యోగాలపై దృష్టి వంటి ఐదు ప్రధాన అంశాలను తమ పార్టీ మేనిఫెస్టోగా పేర్కొన్నారు.
వైసీపీలో అంతర్గత రాజకీయాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వైసీపీకి వైఎస్ జగన్ ఒక్కరే నేత అని, మిగతా వారంతా కార్యకర్తలేనని స్పష్టం చేశారు.
వైసీపీలో తనపై జరుగుతున్న నమ్మకద్రోహి ప్రచారంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను నిజంగా నమ్మకద్రోహినైతే జగన్ జైలులో ఉన్న సమయంలోనే అప్రూవర్‌గా మారేవాడినని అన్నారు. పార్టీలో ‘కోటరీ’ నేతలే జగన్‌కు వెన్నుపోటు రాజకీయాలు చేశారని ఆరోపించారు.
కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. సంక్షేమంతో ప్రజలకు భరోసా కల్పిస్తూ, అభివృద్ధితో రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తున్నామని ఆయన తెలిపారు.
అమరావతి నిర్మాణ పనుల్లో భారీగా అవినీతి జరుగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. 21.77 కి.మీ. సీడ్ యాక్సెస్ రోడ్డుకు రూ.1,519 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించారు.
అమరావతి రాజధాని అభివృద్ధిలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ ఈ-3 రెండో దశను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రూ.1,519 కోట్లతో నిర్మించిన ఈ 21.77 కిలోమీటర్ల కారిడార్ రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలవనుంది. ఈ సందర్భంగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను సీఎం కొనియాడుతూ వారికి పాదాభివందనం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో డబుల్ ఇంజన్ స్పీడుతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో రౌడీయిజం, గంజాయి బ్యాచ్‌లను పూర్తిగా అణిచివేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, శాసన మండలిలో వైసీపీ సభ్యులు లేవనెత్తే ప్రతి అంశానికి స్పష్టమైన సమాధానం ఇచ్చేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం.
కళలు కేవలం గోడల మధ్య పరిమితం కాకుండా ప్రజల మధ్యకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కళలు ఒక జాతి సంస్కృతికి ప్రతిబింబమని, సమాజ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు నెలలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను ప్రారంభించి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చరిత్ర, ప్రజల ఉద్యమం, పునర్నిర్మాణ సంకల్పాన్ని ప్రతిబింబించే "Amaravati: Built by the People... Protected by Destiny" కాఫీ టేబుల్ బుక్‌ను కేంద్ర విద్యుత్, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ఏపీ కూటమి ఎంపీల బృందం బుధవారం అందజేసింది. ఈ బృందంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు మోదీ ఆక్సిజన్‌లా నిలిచారని, అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు, రైల్వే జోన్ వంటి కీలక అంశాల్లో కేంద్రం అండగా నిలిచిందన్నారు.
మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ సతీమణి చెన్నమ్మ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్‌లో పరామర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దేవెగౌడ కుటుంబానికి ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి 45 రోజుల పాటు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కీలక సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో భూ రికార్డుల నిర్వహణను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మార్చేందుకు ప్రభుత్వం 'మీభూమి–బ్లాక్‌చెయిన్' పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.