కీప్ ఇట్ అప్.. బాపట్ల పోలీసుల పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

మహిళల భద్రత, గంజాయి నిర్మూలనలో బాపట్ల జిల్లా పోలీసులు రాష్ట్ర సగటు కంటే మెరుగైన పనితీరు కనబర్చారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు.

7 ఆగస్టు, 2026 6:04 PM•ByRalin

Share this article

కీప్ ఇట్ అప్.. బాపట్ల పోలీసుల పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

చీరాల నియోజకవర్గం కొత్తపేటలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

బాపట్ల, ఆగస్టు 7 (జనవాణి): మహిళల భద్రత, గంజాయి నిర్మూలనలో బాపట్ల జిల్లా పోలీసులు రాష్ట్ర సగటు కంటే మెరుగైన పనితీరు కనబర్చారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో నిర్వహించిన నేతన్న సేవలో' కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, జిల్లా పోలీసుల పనితీరును ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్‌ను ఉద్దేశించి, శాంతిభద్రతల పరిరక్షణలో బాపట్ల పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ పనిచేయాలని సూచిస్తూ "కీప్ ఇట్ అప్" అంటూ అభినందించారు.

మహిళలపై జరుగుతున్న నేరాల నియంత్రణలో బాపట్ల జిల్లా పోలీసులు రాష్ట్ర సగటు కంటే రెండు శాతం అధిక పురోగతి సాధించారని చంద్రబాబు తెలిపారు. మహిళల భద్రతకు పోలీసులు నిరంతరం అండగా నిలిస్తే సమాజంలో మహిళలు నిర్భయంగా సంచరించే పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు.

జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాల నియంత్రణలోనూ బాపట్ల పోలీసులు రాష్ట్ర సగటు కంటే 2.64 శాతం అధిక పనితీరు కనబర్చారని సీఎం పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణలో పోలీసులు చేపడుతున్న చర్యలను అభినందిస్తూ, రానున్న రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా విధులు నిర్వర్తించాలని, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పోలీసు అధికారులను ఆదేశించారు.

జిల్లాలో నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటూ పోలీసు శాఖను ముందుండి నడిపిస్తున్న ఎస్పీ బి. ఉమామహేశ్వర్ సేవలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించినట్లు జిల్లా పోలీసు శాఖ వెల్లడించింది.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు