బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన.. పురందేశ్వరి, స్మృతి ఇరానీ లకు కీలక పదవులు

బీజేపీ అధిష్ఠానం నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. జాతీయ ఉపాధ్యక్షులుగా 13 మందిని నియమించగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డి. పురందేశ్వరికి మరోసారి కీలక బాధ్యతలు దక్కాయి. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అయితే తెలంగాణకు జాతీయ కార్యవర్గంలో ప్రాతినిధ్యం దక్కకపోవడం, జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణను తప్పించడం చర్చనీయాంశంగా మారింది.

17 ఆగస్టు, 2026 4:54 PM•ByNarender Kumar Nangunoori

Share this article

బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన.. పురందేశ్వరి, స్మృతి ఇరానీ లకు కీలక పదవులు

social media image

ఢిల్లీ, ఆగస్టు 17 (జనవాణి): పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అధిష్ఠానం నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నేతృత్వంలో అనుభవజ్ఞులు, యువ నాయకులతో కూడిన కొత్త టీమ్‌ను ఏర్పాటు చేసింది. ప్రాంతీయ సమతుల్యతతో పాటు మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేలా నియామకాలు చేపట్టింది. జాతీయ ఉపాధ్యక్షులుగా డి. పురందేశ్వరి, వసుంధర రాజే సింధియా, తీరథ్ సింగ్ రావత్, రామ్ మాధవ్, బైజయంత్ జయ్ పాండా సహా 13 మందిని నియమించింది. వీరిలో ఆరుగురు మహిళలు ఉండటం విశేషం.

పురందేశ్వరికి కీలక బాధ్యత

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డి. పురందేశ్వరికి జాతీయ ఉపాధ్యక్షురాలిగా మరోసారి అవకాశం లభించింది. అదే సమయంలో తెలంగాణకు చెందిన నాయకులకు జాతీయ కార్యవర్గంలో చోటు దక్కలేదు. గతంలో జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణను తాజా జాబితా నుంచి తప్పించారు.

స్మృతి ఇరానీకి కీలక పదవి

మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. సంస్థాగత వ్యవహారాల్లో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించడం పార్టీ పునర్వ్యవస్థీకరణలో ముఖ్య పరిణామంగా భావిస్తున్నారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, బిప్లబ్ కుమార్ దేబ్, సతీష్ పూనియా, గజేంద్ర పటేల్ తదితరులు జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యారు. జాతీయ కార్యదర్శులుగా 16 మందికి అవకాశం కల్పించారు.

బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బీఎల్ సంతోష్ కొనసాగనున్నారు. సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా శివప్రకాశ్, సౌదాన్ సింగ్‌లను నియమించారు. కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జ్‌గా తరుణ్ చుగ్, పార్టీ జాయింట్ కోఆర్డినేటర్‌గా విష్ణువర్ధన్‌రెడ్డిని నియమించింది.

దక్షిణ, తూర్పు రాష్ట్రాలకు ప్రాధాన్యం

కొత్త జాతీయ కార్యవర్గంలో దక్షిణ, తూర్పు రాష్ట్రాలకు ప్రాధాన్యం కనిపించింది. కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు. జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో ఆరుగురు మహిళలకు అవకాశం కల్పించడం ద్వారా మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది.

ఇతర కీలక నియామకాలు

OBC మోర్చా జాతీయ అధ్యక్షుడిగా అమర్‌పాల్ మౌర్యను నియమించింది. జాతీయ కోశాధికారిగా పీయూష్ గోయల్, సంయుక్త కోశాధికారిగా రాజేష్ మంగళ్‌ను నియమించింది. కొత్త కార్యవర్గం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సంస్థాగత బలోపేతానికి కీలకంగా మారనుంది.

జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగతం)

1. బీఎల్ సంతోష్ - ఢిల్లీ

జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శులు (సంస్థాగతం)

1. శివప్రకాశ్ - ముంబై

2. సౌదాన్ సింగ్ - చండీగఢ్

జాతీయ ప్రధాన కార్యదర్శులు

1. వినోద్ తావ్డే - మహారాష్ట్ర

2. సునీల్ బన్సల్ - ఢిల్లీ

3. బిప్లబ్ కుమార్ దేబ్ - త్రిపుర

4. స్మృతి ఇరానీ - ఉత్తరప్రదేశ్

5. డా. సతీష్ పూనియా - రాజస్థాన్

6. గజేంద్ర పటేల్ - మధ్యప్రదేశ్

7. హరీష్ ద్వివేది - ఉత్తరప్రదేశ్

8. సంజయ్ భాటియా - హరియాణా

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు వీరే..

1. డి. పురందేశ్వరి - ఆంధ్రప్రదేశ్

2. వసుంధర రాజే సింధియా - రాజస్థాన్

3. రామ్ మాధవ్ - ఢిల్లీ

4. బైజయంత్ జయ్ పాండా - ఒడిశా

5. తీరథ్ సింగ్ రావత్ - ఉత్తరాఖండ్

6. రేఖా వర్మ - ఉత్తరప్రదేశ్

7. వర్షాబెన్ నరేంద్రభాయ్ - గుజరాత్

8. డా. భారతి ప్రవీణ్ పవార్ - మహారాష్ట్ర

9. సర్దార్ మన్‌ప్రీత్ సింగ్ బాదల్ - పంజాబ్

10. లాల్ సింగ్ ఆర్య - మధ్యప్రదేశ్

11. ప్రొఫెసర్ ఎం. నాగరాజా - కర్ణాటక

12. ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్ - ఉత్తరప్రదేశ్

13. డా. మధుచంద్ర కర్ - పశ్చిమ బెంగాల్

జాతీయ కార్యదర్శులు

1. కవితా పాటిదార్ - మధ్యప్రదేశ్

2. కే. సురేంద్రన్ - కేరళ

3. డా. భోలా సింగ్ - ఉత్తరప్రదేశ్

4. డా. ప్రదీప్ వర్మ - జార్ఖండ్

5. జగదీశ్ ఈశ్వరభాయ్ పటేల్ - గుజరాత్

6. డా. సందీప్ పాఠక్ - ఢిల్లీ

7. ఫాంగ్నోన్ కోన్యాక్ - నాగాలాండ్

8. సంగీతా యాదవ్ - ఉత్తరప్రదేశ్

9. అనిల్ ఆంటోనీ - కేరళ

10. డా. ఎం. వెంకటేశన్ - తమిళనాడు

11. మనోజ్ టిగ్గా - పశ్చిమ బెంగాల్

12. సిద్ధార్థ్ శంభు - బీహార్

13. డా. స్వదేశ్ సింగ్ - ఢిల్లీ

14. మృగాంక్ దేవ్ బర్మన్ - అసోం

15. రోహన్ గుప్తా - గుజరాత్

16. జై ప్రకాశ్ - ఢిల్లీ

జాతీయ కోశాధికారి

1. పీయూష్ గోయల్ - మహారాష్ట్ర

జాతీయ సంయుక్త కోశాధికారి

1. రాజేష్ మంగళ్ - రాజస్థాన్

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు