ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి: పెమ్మసాని

గుంటూరులో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రారంభించారు. ప్రతి భారతీయుడు దేశ గొప్పతనాన్ని గుండెల్లో నిలుపుకోవాలని పిలుపునిచ్చారు.

9 ఆగస్టు, 2026 2:49 PM•ByRalin

Share this article

ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి: పెమ్మసాని

గుంటూరు, ఆగస్టు 9 (జనవాణి): ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలనే ఉద్దేశంతో ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని గుంటూరులో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆదివారం ప్రారంభించారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిర్‌ నుంచి నార్త్‌ సెంటర్‌ వరకు నిర్వహించిన తిరంగా యాత్రలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యధిక జీడీపీ కలిగిన దేశాల్లో భారత్‌ ముందంజలో ఉండటం గర్వకారణమన్నారు. గత 12 ఏళ్లుగా కేంద్రంలో కొనసాగుతున్న బలమైన నాయకత్వమే దేశ ప్రగతికి ప్రధాన కారణమని తెలిపారు. భావితరాలు బాగుపడాలనే సంకల్పంతో స్వాతంత్ర్య సమరయోధులు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. దేశానికి ఇబ్బందులు కలిగించే విచ్ఛిన్న శక్తులను అధిగమిస్తూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భారత్‌ను ముందుకు తీసుకెళ్లే నాయకత్వం దేశానికి ఉందని పేర్కొన్నారు. ఈ మహా సంకల్పానికి కూటమి నాయకులు సైతం తోడుగా నిలుస్తున్నారని తెలిపారు.

ఎమ్మెల్యే మహమ్మద్‌ నసీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. భారతదేశ ఔన్నత్యాన్ని చాటేందుకు అక్షరాలు సరిపోవన్నారు. ప్రతి భారతీయుడు దేశ గొప్పతనాన్ని గుండెల్లో నిలుపుకోవాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులను గుర్తు చేసుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని అన్నారు.

కార్యక్రమంలో గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు తిరుపతిరావు, రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే గల్లా మాధవి, ఇండస్ట్రియల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ డేగల ప్రభాకర్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ షేక్‌ సజీలా, టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్‌ యాదవ్‌, ముజీబ్‌, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు