ఉద్యోగం పేరుతో కుటుంబానికి దూరం.. వేరే మహిళతో కనిపించడంతో చితకబాదిన భార్య

కృష్ణా జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగం పేరుతో మూడేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ కనిపించకుండా తిరుగుతున్న భర్త.. చివరకు తన కాలనీలోని ఓ ఇంట్లో మరో మహిళతో ఉండగా భార్యకు కనిపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన భార్య, కుమారుడితో కలిసి అతడిపై దాడి చేసి పోలీసులకు అప్పగించింది.

3 అక్టోబర్, 2026 12:29 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఉద్యోగం పేరుతో కుటుంబానికి దూరం.. వేరే మహిళతో కనిపించడంతో చితకబాదిన భార్య

గన్నవరం,అక్టోబర్ 3 (జనవాణి): కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో మూడేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్న ఓ వ్యక్తిని భార్య, కుమారుడు కలిసి పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం గన్నవరం మండలం కేసరపల్లి సుందరయ్య కాలనీకి చెందిన దేవరకొండ నరేంద్ర, విజయవాడకు చెందిన ప్రియాంకను 2012లో వివాహం చేసుకున్నాడు. వీరికి 2013లో కుమారుడు జన్మించాడు.

అయితే కొంతకాలంగా నరేంద్ర భార్య, కుమారుడికి దూరంగా ఉంటున్నాడు. ఉద్యోగం పేరుతో హైదరాబాద్, బెంగళూరు, దుబాయ్ తదితర ప్రాంతాలకు వెళ్తున్నానని చెబుతూ ఇంటికి రాకుండా ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నరేంద్ర ఆచూకీ కోసం ప్రియాంక తన కుమారుడితో కలిసి పలు ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో గతంలో ఆమె మాచవరం పోలీస్ స్టేషన్‌లో నరేంద్రపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలో నరేంద్ర తమ కాలనీలోని ఓ ఇంట్లో మరో మహిళతో కలిసి ఉండటాన్ని ప్రియాంక గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె నరేంద్రపై దాడి చేసింది. కుమారుడు కూడా తండ్రిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం ప్రియాంక తన భర్త నరేంద్రను గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించింది. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు