కృష్ణా జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగం పేరుతో మూడేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ కనిపించకుండా తిరుగుతున్న భర్త.. చివరకు తన కాలనీలోని ఓ ఇంట్లో మరో మహిళతో ఉండగా భార్యకు కనిపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన భార్య, కుమారుడితో కలిసి అతడిపై దాడి చేసి పోలీసులకు అప్పగించింది.
‘ది ప్యారడైజ్’ సినిమా విజయంతో జోష్‌లో ఉన్న నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పాటు చిత్ర బృందం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.
అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ పరిణామాల ప్రభావంతో బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కొనసాగుతోంది. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,680గా నమోదైంది. మరోవైపు వెండి ధరలు భారీగా తగ్గి కిలోకు రూ.2.50 లక్షలకు చేరాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో శనివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా గన్నవరం రావాల్సిన ఇండిగో విమానాన్ని రాజమండ్రికి మళ్లించారు. మరోవైపు దుర్గగుడి ఘాట్‌రోడ్డును అధికారులు మూసివేశారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబంపై ఆయన కోడలు మేఘన సంచలన ఆరోపణలు చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించిన మేఘన.. తనకు భద్రత కల్పించాలని, కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డులో ఆమెను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించింది.
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో గతంలో సస్పెండ్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై సస్పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. వారిని తక్షణమే తిరిగి సర్వీసులోకి తీసుకుంటూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సస్పెన్షన్ ఎత్తివేతతో వారిపై కొనసాగుతున్న శాఖాపరమైన చర్యలు, క్రిమినల్ కేసులు ముగిసినట్లు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 2026 దసరా నవరాత్రి మహోత్సవాల షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 11 నుంచి 20 వరకు పది రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారు రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంపై ఆయన కోడలు మేఘన సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త రాజీవ్ సమస్యలు తెలిసి కూడా తనకు వివాహం జరిపించారని, పెళ్లి తర్వాత అదనపు కట్నం కోసం వేధించారని ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌లో చేసిన ప్రతి ఆరోపణకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు వాటిని బయటపెడతానని మేఘన తెలిపారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఈ నెలలోనే విజయవాడ వేదికగా తన రాజకీయ ప్రణాళికను ప్రకటించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చరిత్ర, ప్రజల ఉద్యమం, పునర్నిర్మాణ సంకల్పాన్ని ప్రతిబింబించే "Amaravati: Built by the People... Protected by Destiny" కాఫీ టేబుల్ బుక్‌ను కేంద్ర విద్యుత్, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ఏపీ కూటమి ఎంపీల బృందం బుధవారం అందజేసింది. ఈ బృందంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో సోషల్ మీడియా యాప్ ద్వారా పరిచయం పెంచుకుని ఒడిశా కార్మికులను బెదిరించి రూ.90 వేలు వసూలు చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని యువతకు కీలక సూచనలు చేశారు.
సింగరేణి అనుబంధ సంస్థ ఆప్మెల్ (APHMEL) స్వర్ణోత్సవ సంవత్సరంలో మరో కీలక ముందడుగు వేసింది. విజయవాడలోని ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన 300 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ప్లాంట్ ద్వారా ఏటా సుమారు రూ.24 లక్షల విద్యుత్ ఖర్చు ఆదా కానుండగా, సంస్థ ఈ ఏడాది రూ.23.33 కోట్ల రికార్డు స్థాయి నికర లాభాన్ని నమోదు చేయడం విశేషంగా నిలిచింది.