'మీభూమి–బ్లాక్‌చెయిన్' పైలట్.. భూ రికార్డుల్లో పారదర్శకతకు కొత్త అడుగు సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్‌గా 'మీభూమి–బ్లాక్‌చెయిన్' వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్‌లో భూ రికార్డుల నిర్వహణను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మార్చేందుకు ప్రభుత్వం 'మీభూమి–బ్లాక్‌చెయిన్' పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

23 జులై, 2026 1:15 PM•ByNarender Kumar Nangunoori

Share this article

'మీభూమి–బ్లాక్‌చెయిన్' పైలట్.. భూ రికార్డుల్లో పారదర్శకతకు కొత్త అడుగు సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్‌గా 'మీభూమి–బ్లాక్‌చెయిన్' వ్యవస్థ

అమరావతి (ఆంధ్రప్రదేశ్): జూలై 22: ఆంధ్రప్రదేశ్‌లో భూ రికార్డుల నిర్వహణలో సాంకేతిక విప్లవానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లోని భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తూ 'మీభూమి–బ్లాక్‌చెయిన్' పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్ర భూ రికార్డులకు 'సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్' రూపొందించడం, భూ మోసాలకు అడ్డుకట్ట వేయడం, పౌరులకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

ప్రస్తుతం వెబ్‌ల్యాండ్‌లో భూ రికార్డులు డిజిటలైజ్ అయినప్పటికీ, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో సమాచార వ్యత్యాసాలు ఉండటంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఎన్‌ఐసీ ఆంధ్రప్రదేశ్, ఎన్‌ఐసీ బెంగళూరు సంయుక్తంగా హైపర్‌లెడ్జర్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీ ఆధారంగా ఈ బ్లాక్‌చెయిన్ వ్యవస్థను అభివృద్ధి చేశాయి.

ఈ వ్యవస్థలో ప్రతి భూ పార్సెల్‌కు ప్రత్యేక బ్లాక్‌చెయిన్ గుర్తింపు ఉంటుంది. ప్రతి లావాదేవీ టాంపర్-ప్రూఫ్ విధానంలో శాశ్వతంగా నమోదు అవుతుంది. భూ రికార్డుల్లో మార్పులు ప్రభుత్వం అనుమతించిన ఆన్‌లైన్ సేవల ద్వారానే జరిగేలా రూపొందించారు. అలాగే ఏ అధికారి, ఎప్పుడు మార్పులు చేశారనే వివరాలు కూడా శాశ్వతంగా నమోదవుతాయి.

మొదటి దశలో కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని అస్పరి, పెనుమూరు, రేపల్లె, గన్నవరం, కడియం, గుమ్మలక్ష్మీపురం, కొత్తవలస మండలాల్లో పైలట్ ప్రాజెక్టు అమలు కానుంది.

ఈ పైలట్‌లో 89 రీ-సర్వే గ్రామాలు, 1,37,763 భూ పార్సెల్ మ్యాప్‌లు కవర్ అవుతున్నాయి. ఆటో మ్యుటేషన్, సబ్-డివిజన్, ఎక్స్‌టెంట్ కరెక్షన్ సహా ఎనిమిది పౌర సేవలు ఈ వేదిక ద్వారా అందుబాటులోకి రానున్నాయి. వ్యవసాయం, మత్స్యశాఖ, గనులు, పరిశ్రమలు, విద్యుత్ శాఖ, సీఆర్‌డీఏ, ఆర్థిక సంస్థలు కూడా అవసరమైన మేరకు ఈ సమాచారాన్ని వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.:

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు