జనసేన శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలి

సోషల్ మీడియాలో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు వ్యవహరించే తీరుపై పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. పోస్టులు, వ్యాఖ్యల్లో భాష, భావ వ్యక్తీకరణ విషయంలో సంయమనం పాటించాలని సూచించారు.

14 ఆగస్టు, 2026 7:14 PM•ByNarender Kumar Nangunoori

Share this article

జనసేన శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలి

జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక దిశానిర్దేశం చేశారు. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా వేదికలపై వివిధ అంశాలపై స్పందించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా భాష, భావ వ్యక్తీకరణ విషయంలో పరిధి దాటవద్దని స్పష్టం చేశారు. అనవసర విషయాలపై ఇష్టానుసారం మాట్లాడటం, అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం పార్టీ శ్రేణులకు తగదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణ, సిద్ధాంతాలకు అనుగుణంగా సోషల్ మీడియాలో వ్యవహరించాలని సూచించారు.

జనసేన శ్రేణులకు మార్గదర్శకాలు

  1. వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలి: వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత విమర్శలు, దూషణల జోలికి వెళ్లకూడదు.

  2. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా స్పందించాలి: పార్టీ సిద్ధాంతాలు, మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రతి అంశంపై స్పందించాలి.

  3. ఆవేశానికి లోనుకావద్దు: ఏదైనా అంశంపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. అసభ్య పదజాలాన్ని ఉపయోగించకూడదు.

  4. మహిళలను గౌరవించాలి: మహిళల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ మాట్లాడాలి.

  5. పార్టీ అంతర్గత అంశాలను బహిరంగంగా చర్చించవద్దు: పార్టీ అంతర్గత విషయాలపై సోషల్ మీడియాలో ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయకూడదు. పార్టీ భావజాలాన్ని కించపరిచేలా వ్యవహరించే వారిని పార్టీ ఉపేక్షించదని స్పష్టం చేశారు.

  6. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి: పార్టీ క్రమశిక్షణకు విఘాతం కలిగించేలా లేదా జనసైనికులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసే వారి ప్రభావానికి లోను కావద్దని సూచించారు.

  7. కూటమి స్ఫూర్తిని కాపాడాలి: కూటమి ప్రభుత్వం లక్ష్యాలు, స్ఫూర్తికి అనుగుణంగా మాట్లాడాలని ఆదేశించారు.

  8. ప్రచార వలలో పడొద్దు: రాజకీయ ప్రత్యర్థుల సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మకుండా, పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించే కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు.

  9. విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి: పార్టీ అభ్యున్నతి, జనసైనికులు, వీర మహిళల సంక్షేమం ఎల్లప్పుడూ తన దృష్టిలో ఉంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న వివిధ రకాల విష ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు.

ఈ తొమ్మిది మార్గదర్శకాలను జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు తప్పనిసరిగా పాటించాలని పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు