జనసేన పార్టీ యువజన విభాగానికి ‘జై కొట్టు’ అనే పేరును ఖరారు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ‘జై కొట్టు’ లోగోను ఆవిష్కరించారు.
సోషల్ మీడియాలో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు వ్యవహరించే తీరుపై పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. పోస్టులు, వ్యాఖ్యల్లో భాష, భావ వ్యక్తీకరణ విషయంలో సంయమనం పాటించాలని సూచించారు.
నెల్లూరులో వైసీపీ నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో శ్రీవారి గోవింద నామాలను పేరడీ చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన దైవ నామాలు, భక్తి గీతాలను అపహాస్యం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని సూచించారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరినీ తన కుటుంబ సభ్యుల్లా భావిస్తూ, ఎవరికైనా కష్టం వస్తే ముందుండి ఆదుకుంటున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్రానికి మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలని జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసి వినతిపత్రం సమర్పించారు.
పవన్ కళ్యాణ్ రాజకీయ, సినీ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా.. ఆయన కుటుంబం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి కనిపిస్తుంది. ముఖ్యంగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉండే ఆయన సతీమణి అన్నా లెజినోవా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. రష్యన్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన అన్నా.. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే తన వ్యక్తిగత విజయాలతో కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె జీవితం, ఆస్తులు, పవన్ కళ్యాణ్‌కు అండగా నిలిచిన ప్రయాణం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఆగస్టు 1న ఆయన ఏపీ పర్యటనకు రానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.