తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..చిన్నారులతో సహా పలువురికి గాయాలు

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో శుక్రవారం కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్విమ్స్ ఆస్పత్రికి తరలించగా, ఇద్దరు చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

7 ఆగస్టు, 2026 9:01 PM•ByNarender Kumar Nangunoori

Share this article

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..చిన్నారులతో సహా పలువురికి గాయాలు

Janavaani

తిరుమల, ఆగష్టు 07 (జనవాణి): తిరుమల రెండో ఘాట్ రోడ్డులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న ఓ కారు 22వ మలుపు సమీపంలో అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భక్తులు గాయపడ్డారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

సమాచారం అందుకున్న వెంటనే ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన కారులో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం, కారులో ప్రయాణిస్తున్నవారు కర్ణాటకకు చెందిన భక్తులు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతిలోని స్విమ్స్ (SVIMS) ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ఉన్న ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి.

ఇక, ఈ ఘటనతో ఘాట్ రోడ్డులో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో కొంతసేపు తిరుమల ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రతా సిబ్బంది ప్రమాదానికి గురైన కారును రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అధిక వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం లేదా ఇతర సాంకేతిక కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు