తిరుమలలో హనుమ విగ్రహం చోరీ

ఏడో మైలు వద్ద చిన్న రాతి విగ్రహం అపహరణ 10 ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు

22 జులై, 2026 6:45 AM•ByJanavaani Admin

Share this article

తిరుమలలో హనుమ విగ్రహం చోరీ

తిరుమల, జూలై 22: తిరుమలలోని మొదటి ఘాట్‌రోడ్డులో ఏడో మైలు వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ప్రతిష్ఠించిన చిన్న హనుమ రాతి విగ్రహం చోరీకి గురైంది.

తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే డౌన్ ఘాట్‌రోడ్డులో ఏడో మైలు వద్ద ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని బుధవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గోవింద మాల ధరించిన ఓ వ్యక్తి విగ్రహాన్ని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు.

26 ఏళ్ల క్రితం ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

సమాచారం అందుకున్న వెంటనే తిరుపతి జిల్లా పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. విగ్రహాన్ని గుర్తించేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, ఇతర అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.

పవిత్ర తిరుమల క్షేత్రంలో విగ్రహం చోరీకి గురికావడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. నిందితుడిని త్వరలోనే గుర్తించి విగ్రహాన్ని స్వాధీనం చేసుకుంటామని తిరుపతి జిల్లా పోలీసులు తెలిపారు

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు