తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు పలు ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇదే సమయంలో కొన్ని తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అక్టోబర్ 7న ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఇటీవల వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాలకు హాజరు కాలేకపోయిన భక్తులకు మరోసారి శ్రీవారిని వాహనసేవల్లో దర్శించుకునే అవకాశం రానుంది. అక్టోబర్ 12 నుంచి 20 వరకు తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వివిధ వాహనాలపై మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తిరుమలలో భక్తులను మోసం చేస్తున్న తమిళనాడుకు చెందిన 52 ఏళ్ల మురుగన్ నాగరాజ్ అలియాస్ శంకర్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ ఉద్యోగి, చెన్నై ఎయిర్‌పోర్ట్ ఉద్యోగి పేరుతో నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేసుకుని భక్తులను నమ్మించినట్లు పోలీసులు గుర్తించారు. మాంగళ్య పూజ పేరుతో మోసాలకు పాల్పడినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది.
తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. 2700వ మెట్టు సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుపై చిరుతను చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్, అటవీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోపై టీటీడీ స్పందించింది. ఆ ఫొటోలో ఉన్నది శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదని స్పష్టం చేసింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. టీటీడీ ఫిర్యాదుతో పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తిరుమలలో భక్తులను ఆకట్టుకునేలా ప్రత్యేక పుష్ప ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. కల్యాణ వేదికలో 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో నాలుగు యుగాలతో పాటు భారతీయ సంస్కృతి, పురాణాలు, ఆధ్యాత్మిక అంశాలను ప్రతిబింబించేలా 14 ప్రత్యేక థీమ్స్‌ను తీర్చిదిద్దారు.
తిరుమల శ్రీవారి భక్తుల రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు రిలయన్స్ సంస్థ టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సులను అందిస్తోంది. వీటిలో తొలి విడతగా 15 బస్సులు తిరుమలకు చేరుకున్నాయి. మరో 10 బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. బస్సులతో పాటు 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్‌ను కూడా రిలయన్స్ సమకూర్చనుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భక్తులు, ఉద్యోగుల సంక్షేమంపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తులకు తొలిసారిగా ఎల్‌ఐసీ ద్వారా గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించేందుకు ఆమోదం తెలిపింది. అలాగే ప్రమాదవశాత్తు మరణించే ఉద్యోగుల కుటుంబాలకు అందించే బీమాను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపైనా పాలకమండలి చర్చించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లోకనాథంను అవినీతి నిరోధక శాఖ (ACB) అరెస్ట్ చేసింది. అక్రమ ఆస్తుల కేసులో రెండు రోజుల పాటు నిర్వహించిన సోదాల్లో భారీగా ఆస్తులు, బంగారం, వెండి, నగదు గుర్తించిన అధికారులు.. విచారణ కోసం ఆయనను ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ ఇచ్చింది. శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 25 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
నెల్లూరులో వైసీపీ నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో శ్రీవారి గోవింద నామాలను పేరడీ చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన దైవ నామాలు, భక్తి గీతాలను అపహాస్యం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని సూచించారు.
తిరుమల శ్రీవారి 2026 వార్షిక పుష్పయాగం సేవ టికెట్లను ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ టికెట్ల ద్వారా భక్తులకు ఒకే రోజు రెండుసార్లు శ్రీవారి దర్శనం చేసుకునే అరుదైన అవకాశం లభించనుంది.