లోకేశ్ ధన దాహానికి విజయ డెయిరీ బలి.. మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్

హెరిటేజ్‌ డెయిరీ వ్యాపారాన్ని కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తరించుకునేందుకు లాభాల్లో ఉన్న విజయ డెయిరీని నాశనం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ చూస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.

8 ఆగస్టు, 2026 5:21 PM•ByRalin

Share this article

లోకేశ్ ధన దాహానికి విజయ డెయిరీ బలి.. మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్

మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, ఆగస్టు 8(జనవాణి): హెరిటేజ్‌ డెయిరీ వ్యాపారాన్ని కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తరించుకునేందుకు లాభాల్లో ఉన్న విజయ డెయిరీని నాశనం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ చూస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. శనివారం మచిలీపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడారు. విజయ డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులుతో మంత్రులు బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపించారు. డెయిరీ వ్యవహారాలతో ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు.

విజయా డెయిరీ రైతులు ఎన్నుకునే సహకార వ్యవస్థ అని, ఇది ప్రభుత్వ నామినేటెడ్‌ పదవి కాదని పేర్ని నాని అన్నారు. సంస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వం, మంత్రులకు లేదని పేర్కొన్నారు. చైర్మన్‌గా చలసాని ఆంజనేయులు ఎన్నికైన వెంటనే లోకేశ్‌ ఆదేశాలతో మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర అక్కడికి వెళ్లి ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.

చలసాని ఆంజనేయులును బెదిరించి తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశారని పేర్ని నాని ఆరోపించారు. ఈ ఒత్తిడితో ఆయనకు గుండెపోటు వచ్చి ఆసుపత్రిలోని ఐసీయూలో చేరినప్పటికీ మంత్రులు ఆసుపత్రికి వెళ్లి దౌర్జన్యంగా వ్యవహరించి రాజీనామా చేయించారని పేర్కొన్నారు. విజయ డెయిరీ రైతుల ఆస్తి అని, దాన్ని హెరిటేజ్‌ కోసం దెబ్బతీయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పేర్ని నాని హెచ్చరించారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు ఏ డెయిరీ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోలేదని అన్నారు.

‘జగన్‌ అధికారంలోకి వస్తే చర్యలు’

విజయ డెయిరీని నాశనం చేసేందుకు ప్రయత్నించిన వారిపై భవిష్యత్తులో చర్యలు తప్పవని పేర్ని నాని హెచ్చరించారు. మరో రెండున్నర, మూడేళ్లలో వైఎస్‌ జగన్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు డెయిరీని నాశనం చేసేందుకు ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. లోకేశ్‌ మాటలు విని విజయా డెయిరీలో తప్పుడు పనులకు పాల్పడుతున్నవారికి ఇదే తన హెచ్చరిక అని అన్నారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు