జగన్‌కు వెన్నుపోటు పొడవడం నాకు చేతకాదు.. కోవర్టు రాజకీయాలు తెలియవు: విజయసాయిరెడ్డి

వైసీపీలో తనపై జరుగుతున్న నమ్మకద్రోహి ప్రచారంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను నిజంగా నమ్మకద్రోహినైతే జగన్ జైలులో ఉన్న సమయంలోనే అప్రూవర్‌గా మారేవాడినని అన్నారు. పార్టీలో ‘కోటరీ’ నేతలే జగన్‌కు వెన్నుపోటు రాజకీయాలు చేశారని ఆరోపించారు.

29 ఆగస్టు, 2026 4:12 PM•ByNarender Kumar Nangunoori

Share this article

జగన్‌కు వెన్నుపోటు పొడవడం నాకు చేతకాదు.. కోవర్టు రాజకీయాలు తెలియవు: విజయసాయిరెడ్డి

అమరావతి, ఆగస్టు 29 (జనవాణి): వైసీపీలో తనపై జరుగుతున్న ప్రచారానికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తనను నమ్మకద్రోహిగా చిత్రీకరిస్తున్న ‘కోటరీ’ నాయకులే జగన్‌కు అసలు వెన్నుపోటు రాజకీయాలు చేశారని ఆరోపించారు.

తాను జగన్‌కు నమ్మకస్తుడిగా ఉన్నందుకే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జగన్‌తో పాటు పలు CBI, ED కేసుల్లో తనను A2గా చేర్చిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. జగన్ 16 నెలలు జైలులో ఉంటే.. తాను 15 నెలలు జైలు జీవితం గడిపానని గుర్తుచేశారు. తనలో నమ్మకద్రోహం ఉండి ఉంటే అప్పుడే అప్రూవర్‌గా మారేవాడినని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల అనంతరం తనకు సంబంధం లేని లిక్కర్ స్కామ్ కేసులో A5గా, కాకినాడ సీ పోర్ట్ కేసులో A2గా తనను చేర్చారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

2019 ఎన్నికల తర్వాత వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం పెరిగిందని ఆయన విమర్శించారు. సజ్జల రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని ఆరోపిస్తూ.. జగన్‌ను ఎవరూ కలవకుండా అడ్డుకోవడంతో పాటు, కుటుంబ సభ్యులు ఆయనకు దూరం కావడానికి కూడా ఆయనే కారణమని వ్యాఖ్యానించారు. ‘కోటరీ’ నేతల వల్ల ఎదురైన అవమానాలను భరించలేక, ఆత్మగౌరవాన్ని చంపుకొని పార్టీలో కొనసాగలేకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని విజయసాయిరెడ్డి తెలిపారు. జగన్‌కు వెన్నుపోటు పొడిచి కేసుల నుంచి బయటపడే రాజకీయాలు తనకు తెలియవని, కోవర్టు రాజకీయాలు చేయడం తన వల్ల కాదని అన్నారు. ‘కోటరీ’ నాయకుడి చేతిలో జగన్ బందీ అయ్యారని విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు