మోదీని తిడితేనే మీ నోట కన్నీరొస్తే.. వారి గోస చూస్తే గుండె తరుక్కుపోవడం లేదా.. పవన్ కల్యాణ్‌పై వైఎస్ షర్మిల ధ్వజం

మోసపు మోదీజీ వైభోగాన్ని పొగిడేంత శ్రద్ధ.. కూటమి ప్రభుత్వానికి గోదావరి ముంపు ప్రాంతాలపై లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రధాని గొప్పోడని, మొనగాడని భజన చేసేందుకున్న ఆసక్తి .. నీట మునిగిన గ్రామాల ప్రజలను ఒడ్డున చేర్చేందుకు లేదని అన్నారు.

2 ఆగస్టు, 2026 7:58 PM•ByRalin

Share this article

మోదీని తిడితేనే మీ నోట కన్నీరొస్తే.. వారి గోస చూస్తే గుండె తరుక్కుపోవడం లేదా.. పవన్ కల్యాణ్‌పై వైఎస్ షర్మిల ధ్వజం

YS Sharmila (File Photo)

మోసపు మోదీజీ వైభోగాన్ని పొగిడేంత శ్రద్ధ.. కూటమి ప్రభుత్వానికి గోదావరి ముంపు ప్రాంతాలపై లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రధాని గొప్పోడని, మొనగాడని భజన చేసేందుకున్న ఆసక్తి .. నీట మునిగిన గ్రామాల ప్రజలను ఒడ్డున చేర్చేందుకు లేదని అన్నారు.

ఒకవైపు ఊళ్లకు ఊళ్లు మునుగుతుంటే, గోదావరి ఉగ్రరూపం దాల్చి 100 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతుంటే, 20 వేల మందికి పైగా వరదనీటిలో సర్వం కోల్పోయి నిర్వాసితులుగా మారుతుంటే, తక్షణ పునరావాసం కల్పించాలన్న సోయి ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటు లేదని వైఎస్ షర్మిల విమర్శించారు. వారికి భరోసా ఇవ్వాలన్న భాద్యతను విస్మరించడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.

మోదీజీని తిడితేనే మీ కంట కన్నీరొస్తే, నిర్వాసితుల గోస చూసి మరి గుండె తరుక్కుపోవడం లేదా ? వారి కన్నీటి గోడు వినపడటం లేదా ? తట్ట, బుట్ట సర్దుకుని గ్రామాలు ఖాళీ చేస్తున్న దృశ్యాలు కనిపించలేదా ? వరద ముంపు ఉంటుందని తెలిసి ముందే బాధితులను ఎందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు ? ముంపు గ్రామాలని తెలిసి స్థానికులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని ఇప్పటికే ఎందుకు ఇవ్వలేదు ? అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి మండిపడ్డారు.

గోదావరి వరద ప్రభావం తగ్గే వరకు ముంపు ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని.. వారికి పునరావాసం తక్షణం కల్పించాలని డిమాండ్ చేశారు. పునరావాస కేంద్రాల్లో భోజన వసతులు ఏర్పాటు చేయాలన్నారు. నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి వైద్య సేవలు అందుబాటులో పెట్టాలని సూచించారు. చిన్నారులు, గర్భిణీల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏటా వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకుని పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు తక్షణం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అందించాలని, సురక్షిత ప్రాంతాల్లో మెరుగైన పునరావాసం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు