వైసీపీకి జగన్ ఒక్కరే నేత.. విజయసాయి వ్యాఖ్యలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

వైసీపీలో అంతర్గత రాజకీయాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వైసీపీకి వైఎస్ జగన్ ఒక్కరే నేత అని, మిగతా వారంతా కార్యకర్తలేనని స్పష్టం చేశారు.

30 ఆగస్టు, 2026 4:25 PM•ByNarender Kumar Nangunoori

Share this article

వైసీపీకి జగన్ ఒక్కరే నేత.. విజయసాయి వ్యాఖ్యలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

అమరావతి, ఆగస్టు 30 (జనవాణి): వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. విజయసాయి సొంత కారణాలతోనే వైసీపీని వీడారని, పార్టీ నుంచి ఎందుకు బయటకు వెళ్లారో ఎవరికీ తెలియదని అన్నారు. వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్లు విజయసాయే గతంలో చెప్పారని గుర్తుచేశారు. పార్టీని వీడిన వారిపై వైఎస్ జగన్ ఎప్పుడూ ప్రతికూలంగా మాట్లాడలేదని సజ్జల తెలిపారు. అయితే ప్రస్తుతం జగన్, వైసీపీపై విమర్శలు చేసేందుకు పాత్రలు మాత్రమే మారుతున్నాయని ఆరోపించారు. జగన్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని అన్నారు.

40 ఏళ్లుగా జగన్ వెంట ఉన్న వ్యక్తిగా విజయసాయి ఆరోపణలు చేయడం సరికాదని సజ్జల వ్యాఖ్యానించారు. వైసీపీ అంటే ఓ కోటరీ అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. విజయసాయి ఆరోపణలతో పార్టీలో అపోహలు ఏర్పడే అవకాశం ఉన్నందున వాటిని నివృత్తి చేసేందుకే వివరణ ఇస్తున్నట్లు తెలిపారు. విజయసాయికి జగన్ పార్టీలో నంబర్-2 స్థానం కల్పించారని సజ్జల పేర్కొన్నారు. వైసీపీలో ఆయనకు వచ్చినన్ని పదవులు మరెవరికీ రాలేదన్నారు. అయితే ‘జగన్ నంబర్-2, సజ్జల నంబర్-1’ అని విజయసాయి చేసిన వ్యాఖ్యలు సరికావని స్పష్టం చేశారు.

వైసీపీకి కర్త, కర్మ, క్రియ వైఎస్ జగనేనని, పార్టీలో జగన్ ఒక్కరే నేత అని సజ్జల తేల్చిచెప్పారు. మిగతా వారంతా కార్యకర్తలేనని అన్నారు. తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా తాను పట్టించుకోలేదని, పదవుల కంటే జగన్‌తో తనకున్న అనుబంధమే తన అదృష్టమని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలినప్పటికీ పార్టీ ప్రస్తుతం వేగంగా పుంజుకుంటోందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు