చిరంజీవి–పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో పాన్ ఇండియా సినిమా.. ఎప్పటి నుంచి అంటే?

రామ్‌చరణ్‌తో ‘పెద్ది’ తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబు తన తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చిరంజీవి కోసం బుచ్చిబాబు రా అండ్ రస్టిక్ నేపథ్యంలో ఓ కథ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

5 అక్టోబర్, 2026 5:02 PM•ByNarender Kumar Nangunoori

Share this article

చిరంజీవి–పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో పాన్ ఇండియా సినిమా.. ఎప్పటి నుంచి అంటే?

రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా దర్శకుడిగా బుచ్చిబాబు టేకింగ్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. కథను నిజాయితీగా తెరపై ఆవిష్కరించిన విధానం, ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా క్రికెటర్, రెజ్లర్‌గా రామ్‌చరణ్ పాత్రను తీర్చిదిద్దిన విధానానికి ప్రశంసలు లభించాయి.

చిరంజీవితో బుచ్చిబాబు సినిమా?

‘పెద్ది’ తర్వాత బుచ్చిబాబు తన తదుపరి సినిమాను మరో మెగా హీరోతో చేయనున్నట్లు టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి–బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం.

‘పెద్ది’లో బుచ్చిబాబు పనితీరుతో ఇంప్రెస్ అయిన చిరంజీవి తన కోసం ఓ మంచి కథ సిద్ధం చేయాలని సూచించినట్లు టాక్. దీంతో మెగాస్టార్ ఇమేజ్‌కు సరిపోయేలా బుచ్చిబాబు రా అండ్ రస్టిక్ పాయింట్‌తో కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల చిరంజీవిని కలిసి కథను వినిపించగా అందులోని కథాంశంతో పాటు ఎమోషన్స్ కూడా మెగాస్టార్‌కు నచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధం చేయాలని ఆయన సూచించినట్లు సమాచారం.

వచ్చే ఏడాది సెట్స్‌పైకి?

ప్రస్తుతం చిరంజీవి ‘కాకా’ సినిమాతో బిజీగా ఉన్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాల తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చిరంజీవి సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్. వచ్చే ఏడాది వేసవి నుంచి షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు గత చిత్రాల తరహాలోనే రియలిస్టిక్ ఎమోషన్స్, యాక్షన్, రా అండ్ రస్టిక్ ట్రీట్‌మెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు