‘ఇరుముడి’ టీమ్‌కు చిరంజీవి, రామ్ చరణ్ ప్రశంసలు

సినిమా చిన్నదా.. పెద్దదా అని చూడకుండా మంచి విజయం సాధించిన చిత్రాలను అభినందించడం మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకత. తాజాగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకున్న ‘ఇరుముడి’ చిత్రబృందాన్ని చిరంజీవి, రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందించారు. చిత్రబృందాన్ని ఇంటికి ఆహ్వానించి ఆప్యాయంగా ముచ్చటించిన మెగా హీరోల ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

13 సెప్టెంబర్, 2026 6:15 PM•ByNarender Kumar Nangunoori

Share this article

‘ఇరుముడి’ టీమ్‌కు చిరంజీవి, రామ్ చరణ్ ప్రశంసలు

సినిమాలంటే మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలనే కాకుండా ప్రేక్షకులను అలరించి విజయాన్ని అందుకున్న ప్రతి చిత్రాన్ని, ఆ చిత్రబృందాన్ని అభినందించడం ఆయనకు అలవాటు. సినిమా చిన్నదా, పెద్దదా అనే తేడా లేకుండా మంచి కంటెంట్‌తో మెప్పించిన వారిని ప్రోత్సహిస్తుంటారు.

తాజాగా బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ అందుకున్న ‘ఇరుముడి’ చిత్రబృందానికి చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. చిత్రబృందాన్ని ఇంటికి ఆహ్వానించిన వీరిద్దరూ వారితో కొంత సమయం ఆప్యాయంగా గడిపారు.

‘ఇరుముడి’ సాధించిన విజయంపై చిరంజీవి, రామ్ చరణ్ హర్షం వ్యక్తం చేశారు. సినిమాలోని కథాంశం, రవితేజ నటన, శివ నిర్వాణ టేకింగ్‌తో పాటు సాంకేతిక బృందం చేసిన కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. రవితేజతో చిరంజీవి, రామ్ చరణ్‌కు ఉన్న సాన్నిహిత్యం తెలిసిందే. దీంతో ఈ సక్సెస్ మీట్ మరింత ఆత్మీయంగా సాగింది. ఈ విజయం చిత్రబృందానికి మరిన్ని మంచి చిత్రాలు తెరకెక్కించేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని చిరంజీవి అభినందించారు. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ నుంచి అందిన ఈ ప్రశంసలు ‘ఇరుముడి’ టీమ్‌లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.

ఇదిలా ఉంటే.. చిరంజీవి, రామ్ చరణ్, రవితేజ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘ది మెగా మాస్ మూమెంట్’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఫొటోలను అధికారికంగా షేర్ చేసింది. ముగ్గురు మాస్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో టాలీవుడ్ వర్గాలు, అభిమానులు ఈ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘ఇరుముడి’ థియేటర్లలో మాస్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుండగా.. చిరంజీవి, రామ్ చరణ్‌ల అభినందనలు చిత్రబృందానికి మరింత బలాన్ని ఇచ్చాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు