గౌతమ్ ఘట్టమనేని 20వ బర్త్‌డే..తనయుడికి మహేష్, నమ్రత స్పెషల్ విషెస్.. వైరల్ అవుతున్న పోస్టులు

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతుల కుమారుడు గౌతమ్ ఘట్టమనేని 20వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు, నమ్రతలు సోషల్ మీడియా వేదికగా తనయుడికి ప్రేమపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. దీంతో అభిమానులు కూడా ‘హ్యాపీ బర్త్‌డే సింబా.. రాబోయే సూపర్‌స్టార్’ అంటూ విషెస్ చెబుతున్నారు.

31 ఆగస్టు, 2026 3:36 PM•ByNarender Kumar Nangunoori

Share this article

గౌతమ్ ఘట్టమనేని 20వ బర్త్‌డే..తనయుడికి మహేష్, నమ్రత స్పెషల్ విషెస్.. వైరల్ అవుతున్న పోస్టులు

Social Media Image

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతుల కుమారుడు గౌతమ్ ఘట్టమనేని 20వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజున తనయుడికి మహేష్ బాబు, నమ్రతలు సోషల్ మీడియా ద్వారా స్పెషల్ విషెస్ తెలిపారు. మహేష్ బాబు తనయుడు గౌతమ్‌తో కలిసి నడుస్తున్న అందమైన ఫొటోను షేర్ చేశారు. “Happy 20 GG!” అంటూ విషెస్ చెప్పిన మహేష్.. జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్న గౌతమ్ ఎప్పుడూ ధైర్యంగా, దయతో ఉండాలని, తన కలలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించారు. తనను చూసిన ప్రతిసారీ తండ్రిగా గర్వపడుతుంటానని ప్రేమను వ్యక్తం చేశారు.

మరోవైపు నమ్రతా శిరోద్కర్ కూడా గౌతమ్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ ఓ ఫొటోను పంచుకున్నారు. తన కొడుకుగా గౌతమ్‌ను చెప్పుకోవడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొంటూ.. అతని కలలు, లక్ష్యాలన్నీ నెరవేరాలని కోరుకున్నారు. ఎప్పటికీ తనను ప్రేమిస్తూనే ఉంటానంటూ ఎమోషనల్‌గా విషెస్ తెలిపారు.

ప్రస్తుతం గౌతమ్ అమెరికాలో తన చదువుపై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో తన కొత్త ఫొటోలను షేర్ చేస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. గౌతమ్ 20వ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు, నమ్రత చేసిన ప్రేమపూర్వక పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు కూడా పెద్ద ఎత్తున బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. “హ్యాపీ బర్త్‌డే సింబా.. రాబోయే సూపర్‌స్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు” అంటూ పోస్టులు పెడుతున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు