తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్, రామ్‌చరణ్‌తో అనుకున్న ప్రాజెక్టులు ప్రస్తుతానికి ముందుకు వెళ్లకపోవడంతో లోకేష్ ఇప్పుడు మహేశ్ బాబుతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్నేళ్లుగా గడ్డంతో రఫ్ లుక్‌లో కనిపించిన ఆయన.. తాజాగా క్లీన్ షేవ్‌తో మునుపటి కంటే యంగ్‌గా దర్శనమిచ్చారు. ‘వారణాసి’ షూటింగ్‌లో భాగంగా కాశీ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న మహేశ్‌ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే ఈ కొత్త లుక్ వెనుక ‘వారణాసి’లోని కీలక పాత్రే కారణమా అన్న ఆసక్తి ఇప్పుడు నెలకొంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతుల కుమారుడు గౌతమ్ ఘట్టమనేని 20వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు, నమ్రతలు సోషల్ మీడియా వేదికగా తనయుడికి ప్రేమపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. దీంతో అభిమానులు కూడా ‘హ్యాపీ బర్త్‌డే సింబా.. రాబోయే సూపర్‌స్టార్’ అంటూ విషెస్ చెబుతున్నారు.
రక్షాబంధన్ సందర్భంగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోదరి, నటి, నిర్మాత మంజుల ఘట్టమనేని భావోద్వేగ పోస్ట్ చేశారు. తోబుట్టువుల బంధం జీవితంలో లభించే అత్యంత విలువైన బహుమతుల్లో ఒకటని పేర్కొంటూ.. మహేశ్‌బాబును ప్రత్యేకంగా ట్యాగ్ చేశారు.
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసిపై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. సినిమాలో సుమారు 20 నిమిషాల రామాయణ ఎపిసోడ్ ఉండనున్నట్లు, ఇందుకోసం 60 రోజుల పాటు షూటింగ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
ఒకప్పుడు రూ.100 కోట్ల బడ్జెట్ అంటేనే సంచలనం. ఇప్పుడు భారతీయ సినిమాలు వేల కోట్ల స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునే విజువల్స్, అత్యాధునిక టెక్నాలజీ, హాలీవుడ్ స్థాయి మేకింగ్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన, తెరకెక్కుతున్న టాప్-10 సినిమాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
పాన్ ఇండియా సినిమాల హవాతో స్టార్ హీరోయిన్ల పారితోషికం కూడా భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఓ స్టార్ హీరోయిన్ తెలుగు సినిమా కోసం రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా ఆమె నిలిచే అవకాశం ఉంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
* రాజమౌళి ‘ఫస్ట్ ఫ్లాప్’ ఏదో తెలుసా?.. ఆ సినిమాతో కుటుంబానికి ఆర్థిక కష్టాలు!
* ‘స్టూడెంట్ నెం.1’ కంటే ముందే మెగాఫోన్ పట్టిన రాజమౌళి?.. ఆ సినిమా సంగతేంటి?
* రాజమౌళి కెరీర్‌లో ఎవరికీ తెలియని సినిమా.. బాక్సాఫీస్ వద్ద నిరాశ!
* నేడు వరల్డ్ క్లాస్ డైరెక్టర్.. కానీ తొలి ప్రయత్నంలోనే ఎదురుదెబ్బ!
* ‘బాహుబలి’ రాజమౌళి ప్రయాణం మొదలైంది అక్కడే.. 1996 నాటి ఆసక్తికర కథ!
ఘట్టమనేని రమేశ్ బాబు కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ, జూలై 30న విడుదలైంది. హీరోయిన్ రవీనా టండన్ కూతురు రాషా తడాని హీరోయిన్ పరిచయం అయ్యింది. మరి ఈ మూవీ టాక్ ఏంటి?
ఒకప్పుడు 'గీత గోవిందం'తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన దర్శకుడు పరశురాం.. 'ది ఫ్యామిలీ స్టార్' తర్వాత దాదాపు మూడేళ్లుగా కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఆయనకు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సినీ ఇండస్ట్రీలో ఒకే హీరోతో ముందుగా హీరోయిన్‌గా నటించి, ఏళ్ల తర్వాత అదే హీరోకు తల్లి పాత్రలో కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. టాలీవుడ్‌లో మహేష్ బాబు కెరీర్‌లో అలాంటి అరుదైన రికార్డు సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే.. సమాధానం రమ్యకృష్ణ.