హిందీలో సంచలనం.. ఇప్పుడు తెలుగులో ‘హనుమాన్ అంశ్’

ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత ఆధారంగా తెరకెక్కిన హిందీ భక్తిరస చిత్రం ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా హిందీలో రూ.175 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో సెప్టెంబర్ 18న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

11 సెప్టెంబర్, 2026 10:24 PM•ByNarender Kumar Nangunoori

Share this article

హిందీలో సంచలనం.. ఇప్పుడు తెలుగులో ‘హనుమాన్ అంశ్’

Social Media Image

Hanuman Ansh: కేవలం రూ.2 కోట్ల బడ్జెట్.. కానీ వసూళ్లు మాత్రం రూ.175 కోట్లకు పైమాటే. ఎలాంటి భారీ ప్రచారం లేకుండా విడుదలై, మౌత్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన భక్తిరస చిత్రం ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగులోకి రాబోతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

హిందీలో ఆగస్టు 7న ఎలాంటి హడావుడి లేకుండా విడుదలైన ‘హనుమాన్ అంశ్’కు తొలుత పెద్దగా స్పందన రాలేదు. తొలి వారంలో కేవలం రూ.90 లక్షలు, రెండో వారంలో రూ.46 లక్షల వసూళ్లు మాత్రమే వచ్చాయి. అయితే మౌత్ టాక్‌తో మూడో వారం నుంచి సినిమా అనూహ్యంగా పుంజుకుంది.

మూడో వారంలో రూ.10 కోట్లు, నాలుగో వారంలో రూ.58.50 కోట్లు రాబట్టింది. ఇక సెప్టెంబర్ 4 నుంచి 6 వరకు సాగిన ఐదో వీకెండ్‌లో ఏకంగా రూ.45.60 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మొత్తంగా భారత్‌లో రూ.175 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రూ.200 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళ్తోంది.

విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభినవ్ సత్య ప్రధాన పాత్రలో నటించారు. ఆధ్యాత్మికత, భక్తి, నీమ్ కరోలి బాబా జీవితంలోని ఆసక్తికరమైన అంశాలను ఆధారంగా చేసుకుని సినిమాను రూపొందించారు.

ఇక ఈ సంచలన చిత్రాన్ని తెలుగులో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పిస్తున్నారు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను థియేటర్లలో విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 18న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఒక అద్భుతమైన గాథ.. ఒక శక్తివంతమైన ప్రయాణం.. దేశం మొత్తాన్ని కదిలించిన కథ అంటూ ‘హనుమాన్ అంశ్’ తెలుగు విడుదలను ప్రకటించారు. ఇప్పటికే హిందీలో సంచలన విజయాన్ని అందుకున్న ఈ డివైన్ బ్లాక్‌బస్టర్‌కు తెలుగులో ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు