ఆ ఇండస్ట్రీ హిట్ సినిమాను రిజెక్ట్ చేసి సుమంత్ తప్పు చేశాడా?

కొన్ని నిర్ణయాలు ఆ సమయంలో సరైనవిగా అనిపించినా.. కాలం గడిచాక మాత్రం అదే నిర్ణయం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇప్పుడు హీరో సుమంత్ కూడా అలాంటి విషయాన్నే బయటపెట్టాడు. తన కెరీర్‌ను మార్చేసే రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలను తానే వదులుకున్నానని, వాటిలో ఒక సినిమా చేయకపోవడం ఇప్పటికీ బాధగా ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

29 జులై, 2026 12:04 PM•ByLaharika

Share this article

ఆ ఇండస్ట్రీ హిట్ సినిమాను రిజెక్ట్ చేసి సుమంత్ తప్పు చేశాడా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో సుమంత్ ఒకరు. కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలు చేసిన ఆయన ప్రస్తుతం కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమంత్‌కు కెరీర్‌లో రిజెక్ట్ చేసిన సినిమాల్లో ఇప్పటికీ బాధపడే సినిమా ఏదైనా ఉందా అని ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

సుమంత్ మాట్లాడుతూ తాను గతంలో కొన్ని మంచి సినిమాలను వదులుకున్నానని చెప్పారు. వాటిలో 'నువ్వే కావాలి'తో పాటు 'దేశముదురు' కూడా ఉందన్నారు. అయితే ఈ రెండు సినిమాల్లో 'నువ్వే కావాలి'ని వదిలేసినందుకు మాత్రం ఇప్పటికీ బాధపడుతుంటానని తెలిపారు. ఆ రోజు ఆ సినిమా చేసి ఉంటే బాగుండేదని ఇప్పుడు కూడా అనిపిస్తుందని అన్నారు. తరుణ్ డెబ్యూ మూవీగా తెరకెక్కిన నువ్వే కావాలి సినిమా కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీల్లో ఒకటిగా నిలిచిపోయింది. అంతేకాదు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.32 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్టు సినిమాగా నిలిచింది. విజయ్ భాస్కర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు, స్రవంతి రవి కిషోర్‌ సంయుక్తంగా నిర్మించారు.

ఇక 'దేశముదురు' సినిమా కథను దర్శకుడు పూరి జగన్నాథ్ తనకు వినిపించారని సుమంత్ చెప్పారు. కానీ అప్పట్లో ఆ కథ తనకు సెట్ కాదని భావించి ఒప్పుకోలేదన్నారు. తర్వాత సినిమా విడుదలైన తర్వాత చూసినప్పుడు ఆ పాత్రకు అల్లు అర్జున్ అద్భుతంగా సరిపోయారని తనకే అనిపించిందని చెప్పారు.

తాను 'దేశముదురు' చేసి ఉంటే అదే స్థాయిలో విజయం సాధించేదో లేదో చెప్పలేనని సుమంత్ అన్నారు. అందుకే ఆ సినిమాను వదిలేసినందుకు పెద్దగా బాధ లేదని చెప్పారు. కానీ 'నువ్వే కావాలి' మాత్రం తప్పకుండా చేయాల్సిన సినిమా అని ఇప్పటికీ అనిపిస్తుందని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు