ఇరుముడి సక్సెస్ సెలబ్రేషన్స్‌లో కిందపడిపోయిన హీరోయిన్ ప్రియా భవానీ శంకర్..వైరల్‌గా మారిన వీడియో

రవితేజ హీరోగా తెరకెక్కిన ఇరుముడి మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో అనుకోని ఘటన చోటుచేసుకుంది. హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ స్టేజ్‌పైకి వెళ్తుండగా అదుపుతప్పి కిందపడిపోయారు. అయితే ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో మూవీ టీమ్ ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

11 సెప్టెంబర్, 2026 2:42 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఇరుముడి సక్సెస్ సెలబ్రేషన్స్‌లో కిందపడిపోయిన హీరోయిన్ ప్రియా భవానీ శంకర్..వైరల్‌గా మారిన వీడియో

Social Media Image

Irumudi Film: రవితేజ హీరోగా నటించిన ఇరుముడి మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటోంది. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం చెబుతోంది. రవితేజ కెరీర్‌లో రూ.200 కోట్ల మార్క్‌ను అందుకున్న తొలి సినిమాగా ఇరుముడి నిలిచిందని పేర్కొంటున్నారు. సినిమా విజయాన్ని పురస్కరించుకుని గురువారం చిత్రబృందం బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో రవితేజ, హీరోయిన్ ప్రియా భవానీ శంకర్‌తో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.

స్టేజ్‌పై కిందపడిపోయిన ప్రియా భవానీ శంకర్

సక్సెస్ మీట్‌లో రవితేజ యూనిట్ సభ్యులకు షీల్డ్‌లను అందజేశారు. ఈ క్రమంలో షీల్డ్ అందుకోవడానికి స్టేజ్‌పైకి వెళ్తున్న ప్రియా భవానీ శంకర్ ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోయారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా కంగారుపడ్డారు. అయితే ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ప్రియా భవానీ శంకర్ స్టేజ్‌పైకి వెళ్లగా రవితేజ ఆమెకు షీల్డ్ అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రెమ్యునరేషన్ తీసుకోని రవితేజ?

ఇరుముడి సినిమాకు రవితేజ రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రాఫిట్ షేరింగ్ విధానంలో నటించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ద్వారా ఆయనకు రూ.75 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తొలి తెలుగు హిట్‌తో ప్రియా భవానీ శంకర్

ఇరుముడిలో ప్రియా భవానీ శంకర్ తల్లి పాత్రలో కనిపించారు. డీ-గ్లామర్ లుక్‌లో సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో ఆమె తెలుగులో తొలి విజయాన్ని అందుకున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధానికి థ్రిల్లర్ అంశాలను జోడిస్తూ దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సాయికుమార్, బేబీ నక్షత్ర కీలక పాత్రల్లో నటించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు