కోలుకుంటున్న జూ. ఎన్టీఆర్.. కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

హీరో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో నిర్వహించిన ఆర్ద్రోస్కోపిక్ సర్జరీ విజయవంతమైంది. ఆపరేషన్ అనంతరం 24 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తారక్‌ను గురువారం డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

13 ఆగస్టు, 2026 5:19 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కోలుకుంటున్న జూ. ఎన్టీఆర్.. కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

హైదరాబాద్, ఆగస్టు 13 (జనవాణి): హీరో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం ఆర్ద్రోస్కోపిక్ సర్జరీ చేయగా.. అనంతరం 24 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో గురువారం ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆపరేషన్ అనంతరం తారక్ తన అభిమానులను ఉద్దేశించి స్పందించారు. తనపై చూపించిన ప్రేమ, చేసిన ప్రార్థనలకు కృతజ్ఞతలు తెలిపారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, తాను క్షేమంగా ఉన్నానని ఎక్స్ వేదికగా వెల్లడించారు. కిమ్స్ వైద్యుల బృందానికి, కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

2-3 నెలలు విశ్రాంతి

కిమ్స్ వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి సుమారు 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కొంతకాలం ఫిజియోథెరపీ కూడా అవసరమని సూచించారు. డిశ్చార్జ్ సమయంలో వైద్యులతో కలిసి ఎన్టీఆర్ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తారక్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

జిమ్‌లో గాయపడిన తారక్

జూలై 27న జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. తొలుత ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆయనకు 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అయితే నొప్పి తీవ్రత పెరగడంతో నిర్వహించిన పరీక్షల్లో శస్త్రచికిత్స అవసరమని తేలింది. దీంతో కిమ్స్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు.

‘డ్రాగన్’ మూవీపై ప్రభావం

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది జూన్‌లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే తారక్‌కు 2-3 నెలల విశ్రాంతి అవసరం కావడంతో షూటింగ్ షెడ్యూల్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. శ్రీలంకలో చిత్రీకరించాల్సిన కొన్ని కీలక సన్నివేశాలు కూడా వాయిదా పడినట్లు సమాచారం.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు