హైదరాబాద్, ఆగస్టు 12 (జనవాణి): టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి నిర్వహించిన సర్జరీ విజయవంతంగా పూర్తయింది. సికింద్రాబాద్‌లోని KIMS హాస్పిటల్స్‌లో ఆర్థోపెడిక్ సర్జన్ల ప్రత్యేక బృందం ఆయనకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ నిర్వహించింది. అనంతరం ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి.
ఇటీవల ఎన్.టి.ఆర్ భుజానికి దురదృష్టవశాత్తు గాయం కావడంతో వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించారు. ఆయన త్వరగా, పూర్తిస్థాయిలో కోలుకునేందుకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేయాలని వైద్యులు నిర్ణయించారు. డాక్టర్ ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాస్ రావు సూరపనేని నేతృత్వంలోని ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాం అని KIMS వైద్యులు తెలిపారు. ఇకపై ఆయన వైద్యుల పర్యవేక్షణలో క్రమబద్ధమైన పునరావాస కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి చేరుకోవడానికి 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని వైద్యులు అంచనా వేశారు.
Loading Tweet...




















