‘ది ప్యారడైజ్’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను మోసం చేశాడు.. మోహన్ బాబు కామెంట్స్

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రంలో మోహన్ బాబు శిఖంజా మాలిక్‌గా విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ చిట్‌చాట్ ఇంటర్వ్యూలో మోహన్ బాబు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తనను ‘మోసం చేశాడంటూ’ సరదాగా వ్యాఖ్యానించారు.

1 అక్టోబర్, 2026 6:51 PM•ByNarender Kumar Nangunoori

Share this article

 ‘ది ప్యారడైజ్’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను మోసం చేశాడు.. మోహన్ బాబు కామెంట్స్

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాలో సీనియర్ నటుడు మోహన్ బాబు ‘శిఖంజా మాలిక్’ అనే ప్రతినాయకుడి పాత్రలో నటించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత విలన్‌గా కనిపించిన మోహన్ బాబు తన డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్‌తో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మోహన్ బాబు పాత్రకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉంటే, ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో భాగంగా నాని, మోహన్ బాబు, శ్రీకాంత్ ఓదెల కలిసి పాల్గొన్న ఓ చిట్‌చాట్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు.

“శ్రీకాంత్ ఓదెల నన్ను మోసం చేశాడు” అంటూ మోహన్ బాబు సరదాగా వ్యాఖ్యానించారు. కథ చెప్పే సమయంలో తన పాత్రకు భార్య ఉంటుందని, అందుకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా దర్శకుడు వివరించాడని చెప్పారు.

“పాత హీరోయిన్లు వద్దు.. కొత్త వాళ్లను పెడదాం అని నేను చెప్పాను. కొత్తవాళ్లనే చూస్తున్నామని, చాలామందిని ఆఫీసుకు పిలిపించి ఆడిషన్స్ కూడా చేశామని శ్రీకాంత్ చెప్పాడు. ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యాక ‘వైఫ్ క్యారెక్టర్ ఎక్కడయ్యా?’ అని అడిగాను. అప్పుడు చావు కబురు చల్లగా చెప్పినట్టు.. సినిమాలో మీకు భార్య పాత్ర వద్దు అనుకున్నామని చెప్పాడు” అని మోహన్ బాబు నవ్వుతూ తెలిపారు.

అంతేకాదు.. ముందుగా చెప్పిన సన్నివేశాలు బాగున్నాయి కదా అని తాను అడిగితే, వాటిని మరో విధంగా మార్చానని శ్రీకాంత్ సమాధానమిచ్చాడని చెప్పారు. “అలా నాకు హీరోయిన్‌ను పెడతానని చెప్పి పెట్టలేదు” అంటూ మోహన్ బాబు సరదాగా వ్యాఖ్యానించారు.

ఇంటర్వ్యూలో మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. తన పాత్రకు సంబంధించిన విషయాన్ని ఆయన హాస్యభరితంగా చెప్పడంతో నాని, శ్రీకాంత్ ఓదెలతో సాగిన ఈ చిట్‌చాట్‌లో ఈ అంశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు