నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రంలో మోహన్ బాబు శిఖంజా మాలిక్‌గా విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ చిట్‌చాట్ ఇంటర్వ్యూలో మోహన్ బాబు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తనను ‘మోసం చేశాడంటూ’ సరదాగా వ్యాఖ్యానించారు.
‘ది ప్యారడైజ్’ సినిమా విజయంతో జోష్‌లో ఉన్న నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పాటు చిత్ర బృందం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా విజయోత్సాహంలో ఉన్న చిత్రబృందం మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని సందర్శించింది. హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరితో పాటు చిత్రబృందం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం, పట్టు వస్త్రాలు సమర్పించింది.
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రెండు రోజుల్లోనే రూ.114 కోట్ల వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సినిమాను థియేటర్‌లో చూడబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సినిమాలో తెలంగాణ అంశాలు, కేసీఆర్‌ను పోలిన ప్రియదర్శి పాత్ర ఉండటంతో కేటీఆర్ సినిమా వీక్షణపై ఆసక్తి నెలకొంది.
న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాపై భిన్న స్పందనలు వస్తుండగా.. నెగెటివ్ రివ్యూస్, సోషల్ మీడియా ట్రోల్స్‌పై నాని స్పందించాడు. ప్రేక్షకుల ప్రేమతో పాటు విమర్శలను కూడా స్వీకరిస్తానని తెలిపాడు.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో, కొన్ని సన్నివేశాల్లో కనిపించిన చిన్న చిన్న పొరపాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. గుర్తింపు కోసం పోరాడే ఓ వర్గం కథను, అధికారం, అస్తిత్వం, రాజకీయ అంశాలతో ముడిపెట్టి దర్శకుడు తెరకెక్కించారు. అయితే కథలోని భావోద్వేగాన్ని మించి హింస, అతిశయోక్తి సన్నివేశాలు కనిపించడం సినిమాకు ప్రతికూలంగా మారింది. నాని నటన ఆకట్టుకున్నప్పటికీ.. కథ, కథనం మాత్రం ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయాయి.
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’పై కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సినిమాలో తాను ‘శికంజ మాలిక్’ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటించినట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 24న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మోహన్‌బాబు వ్యాఖ్యలు నాని అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయి.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాకు సంబంధించిన ‘ఏషనాగుల కట్టమీద’ తెలంగాణ జానపద గీతం మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ లైవ్ కాన్సర్ట్‌లో ఈ పాటను విడుదల చేయగా.. నాని స్వయంగా పాల్గొని అనిరుధ్‌తో కలిసి డ్యాన్స్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న పాన్-ఇండియా చిత్రం ది ప్యారడైజ్. ఈరోజు విడుదలైన సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఘట్టమనేని రమేశ్ బాబు కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ, జూలై 30న విడుదలైంది. హీరోయిన్ రవీనా టండన్ కూతురు రాషా తడాని హీరోయిన్ పరిచయం అయ్యింది. మరి ఈ మూవీ టాక్ ఏంటి?