నాని ‘ది ప్యారడైజ్’కు సెన్సార్ షాక్.. 21 కట్స్, పొలిటికల్ డైలాగులపై అభ్యంతరాలు!

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకుంది. రాజకీయ ప్రస్తావనలు, వివాదాస్పద డైలాగులు, హింసాత్మక సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు మొత్తం 21 మార్పులను సూచించినట్లు సమాచారం. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్‌లో సినిమా దూసుకెళ్తోంది. నైజాంలో బుకింగ్స్ ప్రారంభమైన గంటలోనే 25 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

22 సెప్టెంబర్, 2026 2:14 PM•ByNarender Kumar Nangunoori

Share this article

నాని ‘ది ప్యారడైజ్’కు సెన్సార్ షాక్.. 21 కట్స్, పొలిటికల్ డైలాగులపై అభ్యంతరాలు!
  • ‘ది ప్యారడైజ్’కు సెన్సార్ షాక్.. 21 మార్పులు!

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందే హాట్ టాపిక్‌గా మారింది. ‘దసరా’ తర్వాత ఈ క్రేజీ కాంబో నుంచి వస్తున్న ఈ పీరియాడిక్ క్రైమ్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సినిమా సెన్సార్ ప్రక్రియ పూర్తవడంతో మరింత ఆసక్తి పెరిగింది.

సినిమాలోని రాజకీయ అంశాలు, సమకాలీన రాజకీయ నాయకుల పేర్ల ప్రస్తావనలు, వ్యవస్థపై ఘాటైన వ్యాఖ్యలుగా ఉన్న కొన్ని డైలాగులపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. వీటితో పాటు హింస, రక్తపాతం ఎక్కువగా కనిపించే సన్నివేశాలపైనా బోర్డు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

మొత్తంగా 21 మార్పులు సూచించినట్లు సమాచారం. ఇందులో కొన్ని సన్నివేశాలకు కట్స్ విధించడంతో పాటు, మరికొన్ని సన్నివేశాలు, డైలాగులను మార్చినట్లు తెలుస్తోంది. ఈ మార్పుల అనంతరం సినిమా తుది నిడివి 2 గంటల 54 నిమిషాలుగా ఖరారైనట్లు సమాచారం.

సెన్సార్ కట్స్.. మరోవైపు బుకింగ్స్‌లో జోరు

సెన్సార్ పరంగా సినిమా కొన్ని అభ్యంతరాలను ఎదుర్కొన్నప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్స్‌లో మాత్రం ‘ది ప్యారడైజ్’ దూకుడు చూపిస్తోంది. సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చినట్లు తెలుస్తోంది.

బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కలిపి గంట వ్యవధిలోనే 25 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. నైజాంలోనే ఈ స్థాయిలో స్పందన కనిపించడంతో సినిమా ఓపెనింగ్స్‌పై అంచనాలు మరింత పెరిగాయి.

మురికివాడల నేపథ్యంలో సాగే రా అండ్ రస్టిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ‘ది ప్యారడైజ్‌’లో నాని పాత్ర, శ్రీకాంత్ ఓదెల టేకింగ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. నైజాంతో పాటు ఆంధ్రా, సీడెడ్, ఓవర్సీస్ మార్కెట్లలో బుకింగ్స్ ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెన్సార్ వివాదం, భారీ అంచనాలు, దూసుకెళ్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ మధ్య ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

The Paradise Cuts

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు