ఫ్యాన్స్ కోసం ‘ది ప్యారడైజ్’ స్పెషల్ జాకెట్..ధర తెలిస్తే మైండ్ బ్లాక్!

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డిజైన్ చేసిన స్పెషల్ జాకెట్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.

3 సెప్టెంబర్, 2026 6:25 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఫ్యాన్స్ కోసం ‘ది ప్యారడైజ్’ స్పెషల్ జాకెట్..ధర తెలిస్తే మైండ్ బ్లాక్!

AI Image

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’. పలు వాయిదాల తర్వాత ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. కాయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, రాఘవ్ జోయల్, సోనాలి కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది.

రికార్డులు బద్దలు కొట్టిన ‘ఏశనాగుల చెట్టుమీద’

‘ది ప్యారడైజ్’ నుంచి ఇటీవల విడుదలైన ‘ఏశనాగుల చెట్టుమీద’ ఫోక్ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఎన్టీఆర్ నటించిన ‘దేవర’లోని ‘చుట్టమల్లే’ పాట 50 మిలియన్ల మార్క్‌ను చేరేందుకు ఏడు రోజులు తీసుకుంది. దీంతో ఆ రికార్డును ‘ది ప్యారడైజ్’ సాంగ్ అధిగమించింది.

రూ.25 వేల ‘ది ప్యారడైజ్’ జాకెట్!

మరోవైపు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘ది ప్యారడైజ్’ స్పెషల్ జాకెట్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ జాకెట్లను డిజైన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ కోసం కేవలం 25 జాకెట్లు మాత్రమే అందుబాటులో ఉంచారు. ఒక్కో జాకెట్ ధర రూ.24,999. అసలు ధర రూ.34,999 కాగా డిస్కౌంట్‌తో రూ.25 వేలలోపు అందిస్తున్నారు. అయితే జాకెట్ ధరపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సినిమా మెర్చండైజ్ తీసుకురావడం మంచి ప్రయత్నమేనని కొందరు అంటుండగా.. రూ.25 వేల ధర సామాన్య అభిమానులకు అందుబాటులో ఉండదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

పాన్ ఇండియా మార్కెట్‌పై నాని ఆశలు

‘ది ప్యారడైజ్’పై నాని అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్‌లో సందడి చేయనుంది. ఇక ‘హృదయ కాలేయం’, ‘సింగం 123’ వంటి సినిమాలతో కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేశ్ బాబు ఈ సినిమాలో ఇంతకుముందెన్నడూ చూడని గెటప్‌లో కనిపించనున్నాడు.

ఇప్పటికే ‘సరిపోదా శనివారం’, ‘HIT 3’ చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసిన నానికి ఇతర భాషల్లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. అయితే ‘ది ప్యారడైజ్’కు మొదటి నుంచే ఏర్పడుతున్న క్రేజ్‌తో ఈసారి పాన్ ఇండియా మార్కెట్‌లో నాని గట్టిగా ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు