హైదరాబాద్,సెప్టెంబర్ 30 (జనవాణి): మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తారక్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తన అభిమానులను కలిసిన ప్రతిసారీ వారితో ఎంతో ఆప్యాయంగా మెలిగే ఎన్టీఆర్ తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మించిన ఈ చిత్రానికి శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించారు. సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లో సెప్టెంబర్ 29న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తారక్ వస్తున్నారనే విషయం తెలియడంతో ఆయన అభిమానులు భారీగా ఈవెంట్‌కు తరలివచ్చారు. ఈ క్రమంలో ఓ మూగ, వినికిడి శక్తి లేని అభిమాని కూడా ఎన్టీఆర్‌ను కలిసేందుకు అక్కడికి వచ్చాడు. ఎప్పటి నుంచో తారక్‌ను కలవాలని ఎదురుచూస్తున్న అతడి గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ వెంటనే అతడిని తన క్యారవాన్‌లోకి పిలిపించుకున్నారు.
ఎన్టీఆర్ పేరు రాసి ఉన్న టీ షర్ట్ ధరించి వచ్చిన ఆ అభిమాని దాన్ని తారక్‌కు చూపించడంతో ఎన్టీఆర్ మురిసిపోయారు. అనంతరం ఆ అభిమాని తనకు హగ్ ఇవ్వాలని కోరాడు. ఇటీవల ‘డ్రాగన్’ షూటింగ్‌లో గాయపడిన ఎన్టీఆర్ చేతికి ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చేతికి సపోర్ట్‌గా బెల్ట్ పౌచ్ ధరిస్తున్నారు. అయితే అభిమాని కోరికను నెరవేర్చేందుకు ఎన్టీఆర్ వెంటనే తన చేతికి ఉన్న బెల్ట్ పౌచ్‌ను తీసేసి, అతడిని దగ్గరకు తీసుకుని ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఎన్టీఆర్ గోల్డ్’, ‘మా అన్న మంచి మనసు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ చిత్రంలో నటిస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రష్మిక మందన్నా కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Loading Tweet...




















