నేషనల్ క్రష్ రష్మిక నుంచి ఊహించని యాక్షన్ ఫిలిం.. ‘మైసా’ టీజర్ రిలీజ్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మైసా’. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. రష్మిక డిఫరెంట్ లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లు టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

21 సెప్టెంబర్, 2026 1:47 PM•ByNarender Kumar Nangunoori

Share this article

నేషనల్ క్రష్ రష్మిక నుంచి ఊహించని యాక్షన్ ఫిలిం.. ‘మైసా’ టీజర్ రిలీజ్

‘ది గర్ల్‌ఫ్రెండ్’ తర్వాత రష్మిక మందన్న నటిస్తున్న మరో ఆసక్తికరమైన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మైసా’. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక గోండు జాతికి చెందిన యువతిగా కనిపించనుంది.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం యాక్షన్ అంశాలతో సాగిన టీజర్ ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటివరకు కనిపించని విధంగా రష్మిక పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమెపై తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటున్నాయి.

'యుద్ధానికి ఆయుధం అంటే భయం.. కానీ ఆయుధం ఏ యుద్ధానికీ భయపడదు' అంటూ టీజర్‌లో వినిపించే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. రష్మిక పాత్రను పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.

ఈ సినిమాలో రావు రమేష్, గురు సోమసుందరం, తారక్ పొన్నప్ప కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ‘మైసా’ను నవంబర్ 27న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు