రోహిత్ శర్మతో డేటింగ్ చేశా..‘బ్యాటింగ్ బాగుంది కానీ..’ బెడ్‌పై మాత్రం అంత బాగా ఉండడు’.. నటి కామెంట్స్ వైరల్

టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మపై బాలీవుడ్ నటి, మాజీ మోడల్ సోఫియా హయత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2012లో రోహిత్‌తో డేటింగ్ చేసినట్లు చెప్పిన సోఫియా.. తాజాగా ఓ టాక్ షోలో తమ రిలేషన్‌షిప్ గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేసింది. గతంలోనూ రోహిత్‌తో తన సంబంధంపై ఆమె సోషల్ మీడియాలో పోస్టులు చేసింది.

15 సెప్టెంబర్, 2026 5:05 PM•ByNarender Kumar Nangunoori

Share this article

రోహిత్ శర్మతో డేటింగ్ చేశా..‘బ్యాటింగ్ బాగుంది కానీ..’ బెడ్‌పై మాత్రం అంత బాగా ఉండడు’.. నటి కామెంట్స్ వైరల్

Social Media Image

టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ కెరీర్‌లో వివాదాలు చాలా తక్కువే. అయితే 2012లో బాలీవుడ్ నటి, మోడల్ సోఫియా హయత్‌తో ఆయన డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఓ పబ్‌లో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఫొటోలు అప్పట్లో బయటకు రావడంతో ఈ వార్తలకు మరింత ప్రచారం లభించింది.

తాజాగా రోహిత్ శర్మతో తనకున్న పాత పరిచయంపై సోఫియా హయత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ‘Straight Talk Queer Wisdom’ టాక్ షోలో పాల్గొన్న ఆమె.. రోహిత్‌తో తాను డేటింగ్ చేసినట్లు చెప్పడంతో పాటు, ఆయన వ్యక్తిగత జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాను గతంలో యూత్ ఐకాన్‌గా ఉన్న సమయంలో రోహిత్ శర్మతో డేటింగ్ చేశానని సోఫియా పేర్కొంది. ప్రస్తుతం రోహిత్ ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడని చెప్పిన ఆమె.. క్రికెట్‌లో అతని బ్యాటింగ్‌ ఎంత బాగున్నా, బెడ్‌పై మాత్రం అతని పర్ఫార్మెన్స్ అంత బాగుండదంటూ వ్యాఖ్యానించింది.

ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సోఫియా హయత్ సోషల్ మీడియాలోనూ షేర్ చేసింది. పురుషులకు బెడ్‌రూమ్‌లో ఎలా ఉండాలో ఎవరైనా నేర్పించాల్సిన అవసరం ఉందంటూ ఆమె తన పోస్టులో వ్యాఖ్యానించింది. తన కొత్త షోలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకున్నట్లు తెలిపింది.

అయితే రోహిత్ శర్మతో తన సంబంధం గురించి సోఫియా హయత్ గతంలోనూ పలుమార్లు మాట్లాడింది. 2012 అక్టోబర్‌లో రోహిత్‌తో డేటింగ్ చేసినట్లు ఆమె స్వయంగా ట్వీట్ చేసింది. అయితే ఆ సంబంధం అప్పటికే ముగిసిపోయిందని, భవిష్యత్తులో మళ్లీ రోహిత్‌తో డేటింగ్ చేయనని పేర్కొంది.

సోఫియా హయత్ పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించింది. ‘Bigg Boss Hindi’ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ‘Exitz’, ‘Cash and Curry’, ‘Diary of a Butterfly’, ‘Aksar 2’ వంటి చిత్రాల్లోనూ నటించింది.

ఇదిలా ఉంటే, రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై కూడా కొంతకాలంగా పలు రకాల వార్తలు వస్తున్నాయి. 39 ఏళ్ల రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని భావిస్తున్నాడంటూ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే అతని భవిష్యత్తుపై టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్షన్ కమిటీ నిర్ణయం కీలకం కానుంది. రోహిత్ శర్మ 2015లో స్పోర్ట్స్ మేనేజర్ రితికా సాజ్దేను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు