రాఖీ కట్టి అన్నయ్య అని పిలిచింది.. చివరికి ఆయన్నే పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది.. బాలీవుడ్‌ను షేక్ చేసిన శ్రీదేవి లవ్‌స్టోరీ!

అతిలోక సుందరి శ్రీదేవి వ్యక్తిగత జీవితం కూడా ఆమె సినీ కెరీర్‌లాగే ఎన్నో సంచలనాలకు కారణమైంది. నిర్మాత బోనీ కపూర్‌కు ఒకప్పుడు రాఖీ కట్టిన శ్రీదేవి.. అదే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకోవడం, పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడం అప్పట్లో బాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ప్రేమకథ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలు ఇప్పటికీ అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి.

7 ఆగస్టు, 2026 11:29 AM•ByLaharika

Share this article

రాఖీ కట్టి అన్నయ్య అని పిలిచింది.. చివరికి ఆయన్నే పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది.. బాలీవుడ్‌ను షేక్  చేసిన శ్రీదేవి లవ్‌స్టోరీ!

ఒకప్పుడు భారతీయ సినీ పరిశ్రమను తన అందం, నటనతో ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి వ్యక్తిగత జీవితం కూడా ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువైంది. ముఖ్యంగా నిర్మాత బోనీ కపూర్‌తో ఆమె ప్రేమ, వివాహం చుట్టూ అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. బోనీ కపూర్‌కు ఒక దశలో శ్రీదేవి రాఖీ కూడా కట్టిందట. ఆ తర్వాత అదే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకోవడం, పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడం అప్పట్లో బాలీవుడ్‌లో పెద్ద సంచలనంగా మారింది.

శ్రీదేవి కంటే ముందు బోని కపూర్‌కు, మోనా శౌరీతో పెళ్లైంది. ఆ తర్వాత తన ప్రొడక్షన్‌లో హీరోయిన్‌గా నటించిన శ్రీదేవితో ప్రేమలో పడ్డాడు. అయితే.. ఒక రోజు బోని కపూర్ తల్లి నిర్మలా దేవి.. వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని పసిగట్టి శ్రీదేవిని ఇంటికి పలిచి రాఖి కట్టించి అన్నయ్య అని పిలిపించిందట. ఈ విషయాన్ని స్వయంగా బోని కపూర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే ఆ బంధం అక్కడితో ఆగలేదు. ఇద్దరూ ప్రేమను కొనసాగించి 1996లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందే శ్రీదేవి ప్రెగ్నెంట్ కావడంతో తర్వాత జాన్వీ కపూర్ జన్మించింది. వివాహం అనంతరం ఖుషీ కపూర్ జన్మించింది. ఈ ప్రేమకథ ఇప్పటికీ బాలీవుడ్‌లో ఎక్కువగా చర్చకు వచ్చే సెలబ్రిటీ లవ్ స్టోరీల్లో ఒకటిగా నిలిచింది.

ఇక శ్రీదేవి చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటించి అద్భుతమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1970లో విడుదలైన 'మా నాన్న నిర్దోషి' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో బాలనటిగా పరిచయమైన ఆమె ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మైమరిపించింది. ఇక 'పదహారేళ్ల వయసు' సినిమాతో హీరోయిన్‌గా మారి స్టార్‌డమ్ అందుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో కలిసి నటించి తెలుగు చిత్రసీమలో చెరగని ముద్ర వేశారు.

తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ శ్రీదేవి స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'ఆఖరి పోరాటం', 'గోవిందా గోవిందా', 'క్షణం క్షణం', 'వేటగాడు', 'సర్దార్ పాపారాయుడు' వంటి చిత్రాలతో ఆమెకు అపారమైన అభిమాన వర్గం ఏర్పడింది. ఒక దశలో నిర్మాతలు, హీరోలు ఆమె డేట్ల కోసం నెలల తరబడి ఎదురు చూసేవారని అప్పటి సినీ వర్గాలు చెబుతుంటాయి. కేవలం ఆమె పోస్టర్‌పై కనిపిస్తే చాలు.. హీరో ఎవరా అని కూడా ఆలోచించకుండా థియేటర్‌లకు వెళ్లేవారంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు