హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్, పాటలు, రొమాంటిక్ సన్నివేశాలకే పరిమితం అనే ట్రెండ్‌కు రష్మిక మందన్న చెక్ పెడుతోంది. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా గ్లామర్, రొమాంటిక్ పాత్రల్లో కనిపించిన ఈ బ్యూటీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’తో తన పంథాను మార్చుకుంది. విభిన్న కథలు, సరికొత్త పాత్రలను ఎంచుకుంటూ నటిగా ప్రయోగాలు చేస్తోంది. యాక్షన్ పాత్రల కోసం రిస్క్‌లు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతోంది.
‘రాకా’లో నెగెటివ్ షేడ్స్?
అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘రాకా’పై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
తాజాగా రష్మిక ‘రాకా’ షూటింగ్‌లో జాయిన్ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షెడ్యూల్‌లో అల్లు అర్జున్, రష్మికపై దర్శకుడు అట్లీ కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ సినిమాలో రష్మిక పాత్ర సాధారణ హీరోయిన్ పాత్రకు భిన్నంగా ఉంటుందని టాక్. ఆమె నెగెటివ్ షేడ్స్‌తో కూడిన యాక్షన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ పాత్రకు ధీటుగా ఆమె పాత్రను అట్లీ డిజైన్ చేసినట్లు సమాచారం.
రష్మిక పాత్రలో రెగ్యులర్ హీరోయిన్ తరహా రొమాంటిక్ సన్నివేశాలు, డ్యూయెట్లు ఉండవని కథలో కీలకమైన, సీరియస్ షేడ్స్ ఉన్న పాత్రగా ఆమె క్యారెక్టర్ కొనసాగుతుందని టాక్. అదే నిజమైతే కెరీర్‌లో రష్మికకు ఇది పూర్తిగా కొత్త తరహా పాత్ర కానుంది.
‘పుష్ప’, ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్, రష్మిక కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ జోడీపై కూడా ఆసక్తి నెలకొంది.
భారీ అంచనాలతో ‘రాకా’
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘రాకా’ను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ విషయంలో ఈ సినిమా ఇప్పటికే రికార్డు సృష్టించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. ప్రస్తుతం రష్మిక తెలుగులో ‘రణబలి’, ‘మైసా’ సినిమాలతో బిజీగా ఉంది. వీటితో పాటు ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌కు కూడా ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.




















