వెంకటేశ్–కళ్యాణ్‌రామ్ మల్టీస్టారర్ మూవీకి క్రేజీ టైటిల్ ఫిక్స్...'జనవరి 12 విడుదల'

విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీకి టైటిల్ ఫిక్స్ అయింది. ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ప్రకటించిన చిత్రబృందం.. 2027 జనవరి 12న సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే క్యాప్షన్ కూడా ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.

20 ఆగస్టు, 2026 12:35 PM•ByNarender Kumar Nangunoori

Share this article

వెంకటేశ్–కళ్యాణ్‌రామ్ మల్టీస్టారర్ మూవీకి క్రేజీ టైటిల్ ఫిక్స్...'జనవరి 12 విడుదల'

వెంకటేశ్, నందమూరి కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమాను 2027 జనవరి 12న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అనిల్ రావిపూడి తనదైన స్టైల్‌లో ప్రమోషనల్ వీడియో ద్వారా టైటిల్, రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే క్యాప్షన్‌ను జోడించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్‌రామ్ జోడీగా కృతి శెట్టి నటిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. సంక్రాంతి సీజన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి.. ఈసారి కూడా అదే ఫార్ములాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. వెంకటేశ్‌తో ఇప్పటికే ‘F2’, ‘F3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి విజయవంతమైన సినిమాలు చేసిన అనిల్.. ఇప్పుడు కళ్యాణ్‌రామ్‌తో కలిసి కొత్త కాంబినేషన్‌ను తెరపైకి తీసుకొస్తున్నాడు.

మరోవైపు అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేసింది కూడా కళ్యాణ్‌రామే. ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనిల్.. ఇప్పుడు అదే హీరోతో మరోసారి పనిచేస్తున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌ను ఇంతకుముందెన్నడూ చూడని భిన్నమైన కామెడీ పాత్రలో చూపించనున్నట్లు టాక్. ఇక వెంకటేశ్ పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. కథలోని ఫ్యామిలీ రిలేషన్స్, బావ–బామ్మర్ది నేపథ్యంలో అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించినట్లు సమాచారం. గతంలో ఈ సినిమాకు ‘బాల్‌రెడ్డి బామ్మర్ది’ అనే టైటిల్ పరిశీలనలో ఉందంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది.

2027 సంక్రాంతి బరిలోకి రానున్న ఈ మల్టీస్టారర్‌పై ఇప్పటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత కళ్యాణ్‌రామ్ తన సూపర్‌హిట్ మూవీ ‘బింబిసార’ సీక్వెల్పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు