సూర్యాపేట, ఆగస్టు 14 (జనవాణి): సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో బోనాల ఊరేగింపు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. గురువారం (ఆగస్టు 13) సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఊరేగింపు కొనసాగుతుండగా ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనలో బీఆర్‌ఎస్ యువజన కార్యకర్త గుణగంటి చంద్రకాంత్‌గౌడ్‌పై కొందరు కత్తులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడిలో చంద్రకాంత్‌గౌడ్‌తో పాటు మరికొందరికి గాయాలైనట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన చంద్రకాంత్‌గౌడ్‌ను కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన సూర్యాపేట మెడికల్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దాడికి గల కారణాలు, ఘటనలో పాల్గొన్న వ్యక్తుల వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Loading Tweet...




















