భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్ 1 (జనవాణి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెంలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఇంద్రవెల్లి హరిణి (18) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పవన్‌కుమార్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. హరిణి, పవన్‌కుమార్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే ఇటీవల హరిణి అతడిని దూరం పెట్టడంతో పవన్‌కుమార్ కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పథకం ప్రకారం తన వెంట బైక్ క్లచ్ వైర్ తీసుకెళ్లిన పవన్‌కుమార్ హరిణి గొంతుకు దాన్ని బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. గురువారం జూలూరుపాడు పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.




















