భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెంలో సంచలనం సృష్టించిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఇంద్రవెల్లి హరిణి (18) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారంలో దూరం పెట్టడంతో కక్ష పెంచుకున్న పవన్‌కుమార్ ముందస్తు పథకంతో హరిణిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ హాస్టల్ వార్డెన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. చర్ల మండలం సత్యనారాయణపురంలోని ఎస్టీ బాలుర ఇన్‌చార్జ్ హాస్టల్ వార్డెన్, రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న భూక్యా వాలుసింహ.. మహిళా ఉద్యోగి గైర్హాజరును అనధికారిక గైర్హాజరుగా నమోదు చేయకుండా ఉండేందుకు రూ.14 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన భారీ పెట్టుబడి మోసం కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్‌కుమార్‌ను కేరళలో అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.