హైదరాబాద్, ఆగస్టు 31 (జనవాణి): అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ విఫలమై ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తిరుమలనగర్‌లో నివాసం ఉంటున్న నిభాష్ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు సమాచారం. వీరి వివాహానికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో నిభాష్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడే ముందు తన నిర్ణయాన్ని స్నేహితులకు వాట్సాప్‌లో మెసేజ్ ద్వారా తెలియజేశారు. మెసేజ్‌ను చూసిన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే నిభాష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఘటనపై అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలపై విచారణ కొనసాగుతోంది.




















